Narne Nithin:నితిన్ నార్నే ..మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆయ్ సినిమాతో అలరించిన ఈ కుర్రహీరో తాజాగా ఒక సినిమా షూటింగ్ లో కుడి భుజానికి గాయం అయింది.అయితే ప్రస్తుతం ఆ గాయానికి సర్జరీ విజయవంతంగా పూర్తయిందని తెలుస్తుంది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగినట్టు సమాచారం.
ఈరోజు ఉదయం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని డాక్టర్ ఈశ్వర్ పటేల్, డాక్టర్ హరికృష్ణ బచ్చు, డాక్టర్ మధుసూదన్ లతో కూడిన వైద్య బృందం నితిన్‌కు ఆపరేషన్ చేసింది.ఇక ప్రస్తుతం నితిన్ నార్ణే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని కిమ్స్ వైద్యులు తెలిపారు.
అయితే భుజానికి సర్జరీ జరిగడంతో వెంటనే సాధారణ స్థితికి రావడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తుంది. మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని ఆ తర్వాత భుజం మళ్లీ మామూలుగా పనిచేసేలా ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ చికిత్స తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని సమాచారం.
ఇక నితిన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి వదంతులు ప్రచారం చేయవద్దని కోరాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు కొంత ప్రైవసీ ఇవ్వాలని, అభిమానులు ఆసుపత్రికి వచ్చి ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశాయి.
ఇకపోతే సర్జరీ సక్సెస్ కావడంతో నితిన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆయన తిరిగి ఎప్పుడు షూటింగ్స్‌లో పాల్గొంటారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. పూర్తిగా కోలుకున్న తర్వాతే సినిమా పనుల్లోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం, ఆపరేషన్ విజయవంతం కావడం శుభవార్త అనే చెప్పుకోవాలి.ఇక నార్నే నితిన్ జూనియర్ ఎన్టీఆర్ కి స్వయానా బావ మరిది కావడంతో గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులతో తమ విషెస్ చెప్పుకొస్తున్నారు తారక్ ఫ్యాన్స్.