E-Paper
Advertisement

12 ఏళ్లకే ఇంత కాన్ఫిడెన్సా? ప్రజ్వల్ మామూలోడు కాదు!

12 ఏళ్లకే ఇంత కాన్ఫిడెన్సా? ప్రజ్వల్ మామూలోడు కాదు!
Advertisement

Prajwal Child Artist:ఆదర్శ కుటుంబం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు ప్రజ్వల్.ముఖ్యంగా సినిమా ఈవెంట్స్ లలో ఈ కుర్రాడి హంగామా అంతా ఇంతా కాదు. మైక్ పట్టుకుంటే చాలు మాటల తూటాలు ,పంచుల ప్రవాహాలు చాలా కామన్ అన్నట్టుగా ఉంది మనోడి పరిస్థితి.ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎగబడి ఈ కుర్రాడితో సెల్ఫీలు దిగుతున్నారంటే ఈ కుర్రాడి క్రేజ్ ఎలా పెరిగిపోయిందో అర్థం అయిపోతుంది.ఇదిలా ఉండగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న ప్రజల్వ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు.

అవకాశం రావడం అదృష్టం

Advertisement

తనకి ఈ సినిమాలో అవకాశం అంత ఈజీగా రాలేదని వాపోయాడు.తనతో పాటు చాలామంది పిల్లలు ఆడిషన్స్‌కు వచ్చారని, అందరిలో తనను సెలెక్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పాడు. ముఖ్యంగా వెంకటేష్, త్రివిక్రమ్ లాంటి పెద్దవాళ్ల సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని తెలిపాడు ఈ బుడ్డోడు.

ఇక మొదటిరోజు షూటింగ్‌కు వెళ్లినప్పుడు కొంచెం భయపడ్డానని, అక్కడ ఉన్నవాళ్లతో పెద్దగా పరిచయం లేకపోవడంతో నర్వస్‌గా అనిపించిందని చెప్పాడు. కానీ సెట్‌లోకి వెళ్లాక వెంకటేష్ , త్రివిక్రమ్ , శ్రీనిధి , యువన  అందరూ తనతో చాలా సరదాగా మాట్లాడారని తెలిపాడు. అలా అందరూ ఒక కుటుంబంలా కలిసిపోవడంతో తనకు కూడా ధైర్యం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Advertisement

మొదటిసారి థియేటర్‌కు వెళ్లి

ఇక సినిమా విడుదలైన తర్వాత మొదటిసారి థియేటర్‌కు వెళ్లి తనను తాను సిల్వర్ స్క్రీన్ పై చూసుకున్న ఫీలింగ్ ని గుర్తుచేసుకున్నాడు ప్రజ్వల్. సినిమా మొదలైన కొద్దిసేపటికే తన మొదటి సీన్ వచ్చిందని, వెంటనే తనను తాను చూసుకుని చాలా సంతోషపడ్డానని చెప్పాడు. ఆ తర్వాత మరో రెండు మూడు సీన్లు వచ్చాయి. ఇంకా తన సీన్లు వస్తూనే ఉండటంతో సినిమాలో తాను ఇంతసేపు కనిపిస్తానా అని ఆశ్చర్యపోయానని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ కుర్రాడు.

ఇక థియేటర్‌లో ప్రేక్షకులు తన సీన్లను చూసి బాగున్నాయని చెప్పడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. అయితే షూటింగ్ సమయంలో అందరితో కలిసి గడిపిన రోజులు గుర్తొచ్చి కొంచెం బాధ కూడా అనిపించిందని చెప్పాడు. ఒకవైపు తెరపై తనను చూసుకుని సంతోషపడుతూనే, మరోవైపు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడట ప్రజ్వల్.

బాలయ్య డైలాగ్‌తోనే గుర్తింపు!

ఇక ప్రజ్వల్‌కు నందమూరి బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు, ఆయన చెప్పే డైలాగ్స్ అంటే ఎక్కడ ఎల్ని ఎనర్జీ వచ్చేస్తుందని చెప్పాడు. తనకు మొదటిసారి మంచి గుర్తింపు రావడానికి కూడా బాలయ్య డైలాగే కారణమని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఇక చిన్నప్పుడు ‘డ్రామా జూనియర్స్’ అనే రియాలిటీ షోకు ఎంపికయ్యానని, అందులో చేసిన మొదటి స్కిట్ బాలకృష్ణ గారికి సంబంధించినదే అని ఆ స్కిట్ బాగా హిట్ కావడంతో తనకు మంచి పేరు వచ్చిందని, చివరకు ఆ షోలో టైటిల్ విన్నర్‌గా నిలిచానని చెప్పాడు.

ఎనిమిదో తరగతి చదువుతున్నా.. 

ఇకపోతే తాను ప్రస్తుతం ప్రజ్వల్ ఎనిమిదో తరగతి చదువుతున్నానని చదువు కూడా బాగానే చదువుతానని,పైగా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వస్తాయని చెప్పాడు.ఇక ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడటం అలవాటైందని . స్కూల్‌లో ఇంగ్లీష్ మాట్లాడతానని, ఇంటికి వచ్చాక మాత్రం తెలుగులోనే మాట్లాడుతానని తెలిపాడు.

డైలాగులు చెప్పేటప్పుడు భయం 

ఇక ఆదర్శ కుటుంబంలో వెంకీ మామతో నటించడం, త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో పనిచేయడం అంటే బెరుకుగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు.వాళ్ల ముందు డైలాగులు చెప్పేటప్పుడు కొంచెం భయం ఉండేదని ఎక్కడైనా డైలాగ్ మర్చిపోతానేమో, తప్పుగా చెబుతానేమో అనిపించేదని షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

అయితే ఆ భయాన్ని తగ్గించుకోవడానికి డైలాగులను బాగా ప్రాక్టీస్ చేసేవాడినని, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డైలాగులు చదువుతూ ఉండేవాడినని చెప్పాడు. షూటింగ్‌లో ఒకటి రెండు టేకులు తప్పు వచ్చినా, తర్వాత ఎలా బాగా చేయాలనే దానిపైనే ఫోకస్ పెట్టేవాడినని తెలిపాడు.మొత్తానికి 12 ఏళ్ల వయసులోనే సాలిడ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రజ్వల్.చూడాలి మరి ముందు ముందు ఈ కుర్రాడు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో !

ALSO READ :‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?

Tags

Related News

తమిళ సినిమాల వెంటపడుతున్న నాగవంశీ.. జైలర్ 2 తరువాత మరో మూవీ రిలీజ్ కు సిద్ధం!

రామాయణ సినిమాకు దిల్ రాజు రివ్యూ.. ఆ పాత్ర పై ప్రశంసలు!

తెలుగు సినిమాలపై రాధిక ఆప్టే రగడ.. ఇదేం లెక్క?

నితిన్ నార్ణేకు ఏమైంది? భుజానికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ రిలీజ్..మూగవాడిగా అనీష్ మెప్పించేనా?

బత్తా.. విజయ్ సేతుపతి విశ్వరూపం! తెలుగు హీరోలకు ఇదో ఛాలెంజ్!

వాయిదా పడిన కిరణ్ అబ్బవరం మూవీ.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×