Star Actress: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా మరి కొంతమంది సెలబ్రిటీలు అమ్మలుగా ప్రమోట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటి కియారా అద్వానీ (Kiara Advani)పండంటి ఆడబిడ్డకు(Baby Boy) జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరొక నటీ,నటుడు కూడా తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ జంట పండంటి మగ బిడ్డకు (Baby Boy)జన్మనిచ్చారు. అయితే మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ జంట ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… ఛావా సినిమా(Chhaava) ద్వారా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు వినీత్ కుమార్ సింగ్(Vineet Kumar Singh) ఒకరు.
మగ బిడ్డకు జన్మనిచ్చిన రుచిరా సింగ్..
ఇక ఈయన నటి, మోడల్, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రుచిరా సింగ్(Ruchira Singh) ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో 2021 వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూనే సినీ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే రుచిరాసింగ్ తల్లి కాబోతున్నానంటూ ఇటీవల తన బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉండేవారు. తాజాగా ఈ జంట పండటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.
హృదయాలను దొంగలించాడు…
ఇకపోతే ఈ దంపతులకు జులై 24వ తేదీ బిడ్డ జన్మించగా తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే తమ బిడ్డ ఫోటోని రివీల్ చేయకుండా తమకు మగ బిడ్డ పుట్టారు అంటూ తమ బిడ్డకు స్వాగతం పలుకుతూ ఒక ఎమోషనల్ షేర్ చేశారు. ఈ పోస్టులో భాగంగా “ఆ భగవంతుడి దయ మాపై ఉందని లిటిల్ సింగ్ వచ్చాడు ఇప్పటికే అతను మా హృదయాలను, పాలసీసాలను దొంగలిస్తున్నారు ఈ విలువైన బహుమతి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అనే క్యాప్షన్ తో వీరికి మగ బిడ్డ పుట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను ఎక్కడ ఈ జంట షేర్ చేయలేదు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో ఎంతో గోప్యతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సిద్దార్థ్ మల్హోత్రా,కియారా దంపతులు కూడా తమ బిడ్డ ఫోటోలను చూపించడానికి ఇష్టపడలేదు అలాగే మీడియా వారికి కూడా ఫోటోలు తీయవద్దు అంటూ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జంట కూడా తమ బిడ్డ ఫోటోలను షేర్ చేయకపోయినా తమకు మగ బిడ్డ పుట్టారని తెలిపారు. ప్రస్తుతం వినీత్ నటుడిగా పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Lokesh Kanagaraj: హీరోగా లోకేష్ కనగరాజ్… డెబ్యూ మూవీ దర్శకుడు అతడేనా?