Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) పరిచయం అవసరం లేని పేరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన కూలీ సినిమా(Coolie) పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా లోకేష్ కనగరాజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు తెర వెనుక ఉంటూ తెరపై హీరోలతో మ్యాజిక్ చేసిన లోకేష్ ఇకపై నేరుగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
గ్యాంగ్ స్టర్ గా లోకేష్ కనగరాజ్..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన హీరోగా వెండితెర పై సందడికి సిద్ధమవుతున్నారని, అతి త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి లోకేష్ ఇది వరకు పలు సందర్భాలలో వెల్లడించారు. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran)లోకేష్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.గ్యాంగ్ స్టర్ మూవీగా లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ సినిమా రానుందని కోలీవుడ్ సమాచారం.
ఖైదీ 2 కంటే ముందే..
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ కూడా తనని తాను పూర్తిగా మార్చుకుంటూ ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ డైరెక్షన్ లో కార్తి హీరోగా ఖైదీ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకాస్త సమయం పడుతుందని, ఈలోపు హీరోగా లోకేష్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక దర్శకుడు అరుణ్ కెప్టెన్ మిల్లర్ తర్వాత హీరో ధనుష్ తో ఇళయరాజా బయోపిక్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకి కూడా మరి కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో…
ఇలా ఈ సినిమా ఆలస్యమవుతున్న నేపథ్యంలోనే ఈయన లోకేష్ కనగరాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుంది. ఇక ప్రస్తుతం లోకేష్ కూడా వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాలను పూర్తి చేసుకున్న తర్వాత బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కూడ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల అధికారకంగా ప్రకటించారు. ఇలా వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన హీరోగా కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rashmika: కింగ్ డం ట్రైలర్ పై రష్మిక పోస్ట్.. ముద్దు పేరుతో రిప్లై ఇచ్చిన విజయ్!