RGV Saaree Movie OTT : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma).. నచ్చితే ఎంత పని చేయడానికి అయినా వెనుకాడరు అనడానికి ఇటీవల ఆయన కథ అందించి, నిర్మించిన ‘శారీ’ మూవీ ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో చీర కట్టులో కనిపించి, తన అందాలతో వర్మ దృష్టిని ఆకట్టుకుంది కేరళ కుట్టి శ్రీలక్ష్మి సతీష్(Sreelakshmi Satheesh). ఈమె అందానికి ముగ్ధుడైన వర్మ ఈమె ఎవరో కనిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులను కూడా కోరిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు ఆమె ఎవరో కనిపెట్టి, ఆమెతోనే ఏకంగా శారీ అనే మూవీ చేసి తానేంటో నిరూపించుకున్నారు.
థియేటర్ ఫలితం ఎలా ఉందంటే?
అలా ప్రముఖ డైరెక్టర్ గిరి కృష్ణ కమల్(Giri Krishna Kamal) దర్శకత్వంలో.. సైకో, బోల్డ్ థ్రిల్లర్ మూవీ గా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీని థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ.. ప్రేక్షకాదరణకు మాత్రం పెద్దగా నోచుకోలేదు. వాస్తవానికి థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచిన చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆశతోనే ఈ శారీ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు వర్మ. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై వర్మతో పాటు రవిశంకర్ వర్మ (Ravi Shankar Varma) నిర్మించారు.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్మ శారీ మూవీ..
థియేటర్లలో మెప్పించలేని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో భాగంగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్ ని మెప్పించడానికి స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సినిమాలో సత్య యధు (Satya yadhu), ఆరాధ్య దేవి (Aaradhya Devi)ప్రధాన పాత్రలు పోషించారు. ఒక సామాజిక సందేశంతో తెరకెక్కిన సినిమానే అయినప్పటికీ.. ఇందులో మితిమీరిన హింస, బోల్డ్ సన్నివేశాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమాకు పూర్తిగా దూరం చేశాయి. అదే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 27 నుంచి ‘లయన్స్ గేట్ ప్లే’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా..
నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు గతంలో డైరెక్టర్ గిరి కృష్ణ కమల్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతున్నారో? అమ్మాయిలు వారి దాడికి ఎలా బలవుతున్నారో? ఇలా ప్రతి సన్నివేశాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించి..ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.
శారీ సినిమా స్టోరీ..
కిట్టు అనే ఒక యువకుడు ఒకరోజు తన స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి చీర కట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది. ఇక అంతే ఆమె అందం చూసి మోహితుడైన కిట్టు..అప్పటినుంచి ఆమెను ఎలా అయినా సరే తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. రహస్యంగా ఆమె ఫోటోలు తీస్తూ ఏదో తెలియని అనుభూతిని పొందుతూ ఉంటాడు. అయితే ఆ ఫోటోలతో కోరిక తీరదు అని తెలుసుకున్న కిట్టులో.. ఎలాగైనా సరే ఆమెను తన వశం చేసుకోవాలనే కోరిక బలమవుతుంది. ఆఖరికి ఆమెతో పరిచయం పెంచుకొని, ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను ఒప్పుకోదు. దీంతో ఉన్మాదిలా మారిపోతాడు.
Also read: Sreedhar Son Missing: ప్రముఖ నటుడి కొడుకు మిస్సింగ్.. చివరిగా అక్కడి నుంచి!
సైకోలా మారిన కిట్టు ఆమెను వశపరుచుకున్నాడా?
ఎలాగైనా ఆమెను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇక ఆ ప్రయాణంలో కిట్టు సైకోగా మారుతాడు.. సైకోగా మారిన కిట్టు ఆ అమ్మాయిని తన వశం చేసుకున్నాడా? ఆ అమ్మాయి ఇతడి ప్రేమను ఒప్పుకుందా? ఆ సైకో దాడికి ఆ అమ్మాయి ఎలా తట్టుకుంది? అసలు చివరికి ఏం జరిగింది? ఇలా సస్పెన్స్ తో పాటు క్యూరియాసిటీ పెంచే సన్నివేశాలతో చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. . నిజానికి సస్పెన్స్, థ్రిల్లర్, బోల్డ్ కంటెంట్ తో వచ్చే సినిమాలు.. ఎక్కువగా వైలెన్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతాయి. ఆ కోవ లోకి ఈ సినిమా కూడా వచ్చి చేరుతుంది. మరి ఎందుకో థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మరి కనీసం ఓటీటీ లోనైనా ఈ సినిమాకి ప్రేక్షకాదరణ లభిస్తుందేమో చూడాలి.