Esha Gupta – Hardik: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆ మధ్య తరచూ వార్తలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇది తన ఆటతో మాత్రం కాదు. ఇతర కార్యకలాపాలే అతని వార్తల్లో నిలిచేలా చేశాయి. అవేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. గతంలో హార్దిక్ పాండ్యా బాలీవుడ్ బ్యూటీ ఎల్లీ అవ్రాన్ తో ప్రేమాయణం కొనసాగించాడని.. ఆ తర్వాత ఇషా గుప్తా అనే నటికి దగ్గరయ్యాడని.. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వైరల్ అయ్యాయి.
ఇషా గుప్తా తో హార్దిక్ పాండ్యా చాలా డీప్ లవ్ లో ఉన్నాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ ప్రచారం పీక్స్ కి చేరడంతో ఇషా గుప్తా గతంలోనే వివరణ ఇచ్చింది. తది తనకు సంబంధించిన విషయం అని.. అతడిని పెళ్లి చేసుకోవాలా..? వద్దా..? అనే విషయాన్ని తనకు వదిలేయాలని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని సూచించింది ఇషా గుప్తా.
అయితే ఇదే రూమర్స్ పై హార్దిక్ పాండ్యా తెలివిగా సమాధానం ఇచ్చాడు. ” ఓ అమ్మాయిని చూడడం, డేటింగ్, రిలేషన్షిప్.. ఈ మూడు ఒక్కటేనని నేను గతంలో భావించాను. అయితే ఇప్పుడు నాకు మరో విషయం తెలిసింది. తొలి రెండింటికి కమిట్మెంట్ అవసరం లేదు. మూడో దానికి మాత్రం అది చాలా అవసరం” అంటూ తెలివిగా డేటింగ్ విషయాన్ని దాటవేశాడు హార్దిక్ పాండ్యా.
అలా వీరు ఈ డేటింగ్ రూమర్స్ పై వివరణ ఇచ్చినప్పటికీ.. చాలా కాలం పాటు వీరి మధ్య ప్రేమాయణం గురించి రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాతో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలపై మరోసారి స్పందించింది ఇషా గుప్తా. ” హార్దిక్ పాండ్యా, నేను కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా రెండుసార్లు మీట్ అయ్యాం. కానీ దాన్ని డేటింగ్ అనలేము. డేటింగ్ స్టేజ్ కి ముందే మా బంధం తెగిపోయింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యాతో నేను కాంటాక్ట్ లో లేను” అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది ఇషా గుప్తా.
2012లో జన్నత్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇషా గుప్తా.. తెలుగులో రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ” మూవీలోని ఓ పాటలో సందడి చేసింది. అయితే గతంలో హార్దిక్ పాండ్యా – నటాషా విడాకులు తీసుకోవడానికి కూడా ఇషా గుప్తానే కారణమని రూమర్స్ కూడా వినిపించాయి. హార్దిక్ పాండ్యా విడాకుల పుకార్లు వచ్చిన సందర్భంలో గతంలో ఈ ప్రేమ విషయం బయటపడింది. అప్పటినుండి వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ.. హార్దిక్ పాండ్యాతో తన బంధం తెగిపోయిందని స్పష్టం చేసింది ఇషా.