E-Paper
Advertisement

Actress Trisha: బీజేపీ లీడర్ కి హీరోయిన్ త్రిష మాస్ కౌంటర్.. అసలేమైందంటే?

Actress Trisha: బీజేపీ లీడర్ కి హీరోయిన్ త్రిష మాస్  కౌంటర్.. అసలేమైందంటే?
Advertisement

Actress Trisha: విభేదాలకు దూరంగా.. విమర్శలను పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయే.. అతి కొద్దిమంది హీరోయిన్స్ లో ప్రముఖ హీరోయిన్ త్రిష (Trisha) కూడా ఒకరు. నిత్యం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కాంట్రవర్సీకి దూరంగా ఉండే త్రిషపై తాజాగా ఒక బీజేపీ లీడర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆ బీజేపీ లీడర్ కు ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

త్రిష పై రాజకీయ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు..

విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల తేదీలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్ ను విమర్శిస్తూ ఊహించని కామెంట్లు చేశారు. ” విజయ్ కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాల్టీ తెలుస్తుంది” అంటూ నేరుగా త్రిష పేరును లాగుతూ కామెంట్లు చేయడంతో పెద్ద చర్చే నడిచింది..

బీజేపీ లీడర్ కి త్రిష మాస్ కౌంటర్..

Advertisement

అయితే ఈ విషయాన్ని అధికార డిఎంకె నేతలు , విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఖండించారు కూడా.. ముఖ్యంగా నాగేంద్రన్ ఇలా మాట్లాడడం సరికాదు అని, ఒక అమ్మాయిని ఇందులోకి లాగడం ఏ మాత్రం కరెక్ట్ గా లేదని ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇక దీంతో రంగంలోకి త్రిష దిగేసింది. తన తరఫు లాయర్ చేత ఒక ప్రకటనను విడుదల చేయించింది ఈ ముద్దుగుమ్మ. అందులో.. “ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేసాయి.. రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లైంట్ (త్రిష ) ఎప్పుడూ కూడా ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదు. భవిష్యత్తులో కూడా ఆమెకు అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాలలో ఎప్పుడూ తటస్థ వైఖరినే ఆమె పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలలోకి లాగడం సరికాదు.

ALSO READ:Mahendragiri Varahi Movie: అక్కినేని సుమంత్ సినిమాలో ఇద్దరు క్రేజీ స్టార్స్.. ఎవరెవరు.. ఏ పాత్రలో అంటే?

ఆ మాత్రం తెలియదా..

Advertisement

ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను పబ్లిక్ లో చర్చించకూడదన్న విషయం మీకు తెలియదా? త్రిష పేరును సంబంధంలేని విషయాల్లోకి లాగకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాం” అంటూ ఆమె తరఫు లాయర్ నిత్యేష్ నటరాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా అనవసరంగా త్రిషను బహిరంగంగా కార్నర్ చేసి మాట్లాడడం పద్ధతిగా లేదు అంటూ ఆమె అభిమానులు కూడా విరుచుకుపడుతున్నారు. మరి ఈ నోట్ పై బిజెపి లీడర్ ఏదైనా స్పందిస్తారో చూడాలి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×