E-Paper
Advertisement

Mahendragiri Varahi Movie: అక్కినేని సుమంత్ సినిమాలో ఇద్దరు క్రేజీ స్టార్స్.. ఎవరెవరు.. ఏ పాత్రలో అంటే?

Mahendragiri Varahi Movie: అక్కినేని సుమంత్ సినిమాలో ఇద్దరు క్రేజీ స్టార్స్.. ఎవరెవరు.. ఏ పాత్రలో అంటే?
Advertisement

Mahendragiri Varahi Movie:ఒకప్పుడు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది నటీనటులు సడన్గా ఇండస్ట్రీకి దూరమై మళ్లీ ఎంట్రీ ఇచ్చి.. రీ ఎంట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కొంతమంది హీరోలుగా, హీరోయిన్లుగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అవకాశాలు అందుకుంటుంటే.. మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో తమ టాలెంట్ ను నిరూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అక్కినేని హీరోగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుమంత్ (Sumanth) గతంలో హీరోగా వరుస చిత్రాలు చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘ సీతారామం ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ .. విలన్ పాత్రలతో కూడా అదరగొట్టేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సుమంత్ సినిమాలో క్రేజీ స్టార్స్..

మిస్టరీ , అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. దీనికి తోడు ఇటీవల సుమంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన ఒక షార్ట్ వీడియో కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రత్యేక అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు క్రేజీ స్టార్స్ ఒకే సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వారి పాత్రలు.. సినిమా కథలో కీలక మలుపులకు కారణమవుతాయని, సినిమా స్థాయిని ఇవి మరింత పెంచుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఈ పాత్రలు సినిమా కథనే మార్చనున్నాయా?

Advertisement

ఇక మహేంద్రగిరి వారాహి సినిమాకి జగదీష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా… ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యంలో కూడిన థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్ కెరియర్లో ఇదొక విభిన్నమైన ప్రయత్నం కాగా, ఈ ప్రయత్నానికి సిద్దు జొన్నలగడ్డ , కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తోడవడం సినిమా బిజినెస్ కు , ప్రమోషన్స్ కు మరింత ప్లస్ కానుంది . ఇక త్వరలోనే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఒక గొప్ప నటిని ఈ సినిమాలో భాగం చేయడం సినిమాకు మరింత ప్లస్ కాబోతోంది అనడంలో సందేహం లేదు.

ఇకపోతే అక్కినేని సుమంత్ చివరిగా ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.సన్నీ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈటీవీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుమంత్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:Jr NTR: జూ.ఎన్టీఆర్ కి ఇష్టమైన స్నాక్స్ ఏంటో తెలుసా.. రివీల్ చేసిన మ్యాగజైన్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×