Tollywood: టాలీవుడ్ దిగ్గజ సెలబ్రిటీలైన మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli)తో పాటు పలువురు సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులకు నోటీసులు జారీ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఉన్నట్టుండి సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం ఏంటి? ఎవరు నోటీసులు ఇచ్చారు? ఏ విషయంపై నోటీసులు ఇచ్చారు? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి సినీ సెలబ్రిటీలకు, క్రీడా ప్రముఖులతో పాటు మరికొంతమంది ప్రముఖులకు ఈ నోటీసులు అందడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ, సవరణలు అలాగే ఓటరు వివరాల ధ్రువీకరణలో భాగంగా SIR (Special intensive revision) వీరికి ఈ నోటీసులు పంపించడం జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో ఎన్యూమరేషన్ పత్రాలలో పేర్ల నమోదులో పొరపాట్లు ఉండడంతోనే పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు ఎస్ఐఆర్ నోటీసులు జారీ చేసింది. కేవలం సెలబ్రిటీలకే కాకుండా నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు, సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ వెరిఫికేషన్ నోటీసులు అందించడం జరిగింది.
ఈ మేరకు నోటీసులు అందుకున్న సెలబ్రిటీల జాబితాలో రాజమౌళి , మహేష్ బాబు, నమ్రత (Namrata), వెంకటేష్ (Venkatesh ),సమంత (Samantha), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో పాటు రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన (Upasana)లకు కూడా నోటీసులు.
ఇకపోతే సినీ ప్రముఖులతో పాటు క్రీడా ప్రముఖులు కూడా ఈ జాబితాలో చేరారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ విజేత సైనా నెహ్వాల్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ జాబితాలో ఉన్నాయి.
also read:నిహారిక నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. బొజ్జ గణపయ్య లుక్ చూశారా?
ఇకపోతే ఎస్ఐఆర్ జారీ చేసిన నోటీసులకు సెలబ్రిటీలు స్పందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు విచారణకు అందుబాటులో ఉండాలి. అయితే సెలబ్రిటీలు తమ పనుల కారణంగా సరైన సమయంలో విచారణకు రాలేకపోతే తమ ప్రతినిధులను విచారణకు పంపవచ్చని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం కర్ణాటక ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సమయంలో కూడా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) పేరును అందులో పొందుపరచకపోవడంతో ఆయన ఏకంగా ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా బెంగళూరులో నిరసనలకు నాయకత్వం కూడా వహించారు. బెంగళూరులో తన ఓటు హక్కుకు భంగం వాటిల్లిందని, తన పేరును తొలగించారని ఆరోపించారు. బెంగళూరులో తొలుత 1.08 కోట్లకు పైగా పేర్లను ఏఎస్డీడీఓ విభాగానికి తరలించారు. దీర్ఘకాల నివాసి స్థానికంగా మారినప్పుడు.. ఫారం 8 కి బదులుగా ఫారం 6ను నింపాలనే నిబంధనలను కూడా ఆయన బహిరంగంగా విమర్శించారు. మరి ఇప్పుడు టాలీవుడ్ సినీ సెలెబ్రిటీలు ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.