E-Paper
Advertisement

యువతీయువకుడి వీరంగం.. బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో

యువతీయువకుడి వీరంగం..  బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో
Advertisement

Hyderabad: సిటీలో డ్రైవర్ చేసేవారు జాగ్రత్త అని పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ మైక్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. అయినా సరే అవేమీ పట్టించుకోలేదు కొందరు యువతీ యువకులు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ సిటీలో చోటు చేసుకుంది.

యువతీయువకుడి వీరంగం

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 14లో యువతీ, యువకుడు కారుతో వీరంగం సృష్టించారు. వోక్స్‌ వ్యాగన్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీ కొట్టారు యువతీయువకుడు.

యువతీయువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisement

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. రంజనా రాయ్ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలియగానే బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారుతోపాటు యువతీయువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో వారిద్దరూ పోలీసులతో పదేపదే ఆర్యుమెంట్ చేయడం కనిపించింది.

ఈ తరహా ఘటనలు వారానికి ఒకటి లేదా రెండు ఘటనలు హైదరాబాద్ సిటీలో జరుగుతున్నాయి. అయినా యువకుల్లో ఏ మాత్రం మార్పురాలేదు. వారిపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

 

Related News

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

Big Stories

Advertisement
×