Niharika: మెగా డాటర్ నిహారిక (Niharika) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. ఈమధ్య తన సొంత టాలెంట్ తో ఎదుగుతూ ఏకంగా నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకుంటోంది. వ్యక్తిగతంగా పెళ్లి, విడాకులు అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న నిహారిక ..ఈ మధ్య తన టాలెంట్ తో అందరిని అబ్బురపరుస్తోంది..వరుస సినిమాలను నిర్మిస్తూ.. ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇకపోతే తాజాగా నిహారిక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక వీడియోతో ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా సెలబ్రిటీలు ఇప్పటికే తమ టాలెంటును ఉపయోగించి బొజ్జ గణపయ్యలను తయారు చేస్తూ ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో నిహారిక కూడా ఎంట్రీ ఇచ్చింది. తాను కూడా అతీతం కాదు అంటూ ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా తన మృదువైన చేతులతో భక్తి శ్రద్ధలతో సరదాగా బొజ్జ గణపయ్య ప్రతిమను సిద్ధం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఇక నిహారికలో ఉన్న ఈ టాలెంట్ చూసి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. మెగా డాటర్ నిహారికలో ఇంత టాలెంట్ ఉందా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో.. సాంప్రదాయ చీరకట్టులో ముస్తాబైన నిహారిక తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బుజ్జి గణపయ్యను తయారు చేశారు. ఫైనల్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. బుజ్జి గణపయ్యకు అసలైన వేడుక మొదలయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. తామర పద్మాసనంలో బుజ్జి గణపయ్య కూర్చున్నట్టు నిహారిక డిజైన్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.. ఇకపోతే నిహారిక తాను తయారు చేసిన గణేశుడిని అందరితో చూపించడమే కాకుండా..” నాకు గణేష్ విగ్రహాలు అంటే ఎప్పటినుండో ఇష్టం.. కానీ ఆయన్ని నా చేతులతో..” అంటూ మన ఊహకే వదిలేసింది నిహారిక.
also read:అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!
ఇకపోతే నిహారిక షేర్ చేసిన ఈ వీడియోలో ఆమె లుక్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఎల్లో కలర్ శారీ కి కాంబినేషన్లో ప్రింటెడ్ ఎల్లో ఫ్లవర్స్ తో డిజైన్ చేసిన స్కై బ్లూ కలర్ బ్లౌజ్ ధరించింది. దీనికి కాంబినేషన్లో స్కై బ్లూ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ జత చేసింది. ఇక సింపుల్ జ్యూవెలరీతో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే నిహారిక లుక్ ప్రొద్దుతిరుగుడు పువ్వులా ఉంది అని, ఆమె చేతుల్లో రూపొదిద్దుకున్న గణేశుడికి ప్రాణం పోసినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే నిహారిక షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిహారిక సినిమాల విషయానికొస్తే.. ఒకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు చిత్రాలను నిర్మిస్తోంది.అలా సినిమాలను నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. రాకాస సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిహారిక ప్రస్తుతం తన సోదరుడు, ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ తో కలిసి బరి అనే ఒక ప్రాజెక్టును ప్రకటించింది. అంతేకాదు కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ నూతనతరం డిజిటల్ కంటెంట్, ఫీచర్ ఫిలిమ్స్, ప్రాంతీయ వెబ్ సిరీస్ లను అభివృద్ధి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ .
?stkn=MzNma3F4Y2xrZHpl