E-Paper
Advertisement

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!
Advertisement

Mahindra XUV 7XO Strong Hybrid: మహీంద్రా భవిష్యత్ కార్లలో ఎలక్ట్రిఫైడ్ పవర్‌ ట్రెయిన్లను మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ SUVలపై దృష్టి పెట్టిన సంస్థ.. ఇప్పుడు హైబ్రిడ్, రేంజ్ ఎక్స్‌ టెండర్ టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే XUV 7XOలో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ ను తీసుకురావడానికి కంపెనీ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త హైబ్రిడ్ SUVలో ఫుల్ ఫ్యూయల్ ట్యాంక్ తో 1,000 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించాలన్నది మహీంద్రా లక్ష్యంగా తెలుస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సుదూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉండనుంది.

పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్!

XUV 7XO హైబ్రిడ్‌ లో సిరీస్ ప్యారలల్ హైబ్రిడ్ సిస్టమ్‌ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ కలిసి పని చేస్తాయి. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. సాధారణ పెట్రోల్ ఇంజిన్‌ కు ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ వ్యవస్థ మాత్రం అవసరానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ పవర్‌ను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంలోసాయపడుతుంది.

హైవేపై పెట్రోల్ ఇంజిన్ కీలకం

Advertisement

వేగం పెరిగిన తర్వాత పెట్రోల్ ఇంజిన్ నేరుగా వాహనాన్ని నడపడమే కాకుండా బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. అలాగే కారు వేగం తగ్గుతున్న సమయంలో రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా కొంత శక్తిని తిరిగి బ్యాటరీలోకి పంపవచ్చు. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మధ్య ఈ సమన్వయం వల్ల నగర ప్రయాణాలతో పాటు హైవే డ్రైవింగ్‌లోనూ మంచి సామర్థ్యాన్ని సాధించాలన్నది కంపెనీ ఉద్దేశం.

1,000 కి.మీ.పైగా రేంజ్ సాధ్యమేనా?

XUV 7XO హైబ్రిడ్‌కు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం 1,000 కిలోమీటర్లకు పైగా రేంజ్. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, రీజనరేటివ్ బ్రేకింగ్ కలయికతో ఈ స్థాయి రేంజ్‌ను సాధించాలని మహీంద్రా చూస్తోంది. అయితే, రియల్ వరల్డ్ లో లభించే రేంజ్ డ్రైవింగ్ పరిస్థితులు, వేగం, ట్రాఫిక్, వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. సో, ఫైనల్ మోడల్ విడుదలయ్యే వరకు కచ్చితమైన రేంజ్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.

XEV 9Sకు మరో టెక్నాలజీ

Advertisement

XUV 7XOతో పాటు మహీంద్రా మరో ఆసక్తికరమైన టెక్నాలజీపై కూడా పనిచేస్తోంది. XEV 9S ఎలక్ట్రిక్ SUV కోసం రేంజ్-ఎక్స్‌ టెండర్ పవర్‌ ట్రెయిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది XUV 7XO హైబ్రిడ్‌కు భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ ప్రధానంగా జనరేటర్‌ లా పని చేసి హై వోల్టేజ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. వీల్స్ ను మాత్రం ఎలక్ట్రిక్ మోటార్లు నడిపిస్తాయి. అంటే డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎక్కువగా EV తరహాలోనే ఉండే అవకాశం ఉంది.

Read Also: కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

Tags

Related News

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

178 కి.మీ రేంజ్.. 75 కి.మీ స్పీడ్.. BGauss కొత్త స్కూటర్ ఏముంది భయ్యా!

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

Big Stories

Advertisement
×