E-Paper
Advertisement

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?
Advertisement

Maruti Baleno 2026 On-Road Price: మారుతి సుజుకి నుంచి వచ్చే ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ బాలెనోకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు కొనాలని చూస్తున్న వారికి సంస్థ 2026 మోడల్ కు సంబంధించిన ధరల వివరాలను వెల్లడించింది. ఎక్స్ షోరూమ్ ధరలు రూ.5.98 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉన్నాయి. అయితే, కారు కొనుగోలు చేసే సమయంలో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఆర్‌టీఓ తదితర ఖర్చులు కలవడంతో నగరాన్ని బట్టి ఆన్ రోడ్ ధరలో తేడా ఉంటుంది.

ఐదు ట్రిమ్‌లలో బాలెనో!

2026 మారుతి బాలెనోను సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్‌లలో అందిస్తున్నారు. ఇందులో ఆల్ఫా కొత్తగా లైనప్‌లో చేరిన టాప్ ఎండ్ వేరియంట్. ముఖ్యంగా ఇందులో లెవెల్ 2 ADAS లాంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కొత్త మోడల్‌ లో డిజైన్ పరంగానూ కొన్ని మార్పులు చేశారు. అప్‌డేటెడ్ ఫ్రంట్ ఫేసియా, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ లాంటి ఫీచర్లను యాడ్ చేశారు. భద్రత విషయంలోనూ కొన్ని అప్ డేట్స్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త పెట్రోల్ ఇంజన్

Advertisement

2026 బాలెనోలో ప్రధాన మార్పుల్లో కొత్త 1.2 లీటర్, మూడు సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఒకటి. ఇది గత మోడల్‌తో పోలిస్తే పవర్‌ట్రెయిన్ విషయంలో చేసిన కీలక మార్పుగా చెప్పుకోవచ్చు. బాలెనోను పెట్రోల్‌ తో పాటు CNG ఆప్షన్‌ లోనూ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే కొన్ని వేరియంట్లలో మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌లో రూ.11.84 లక్షల వరకు..

ప్రధాన నగరాల్లో ఆన్ రోడ్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో బాలెనో ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. సిగ్మా MT వేరియంట్ ధర సుమారు రూ.7.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. డెల్టా MT రూ.8.30 లక్షలు, డెల్టా AMT రూ.8.89 లక్షలుగా ఉన్నాయి. జీటా MT ధర రూ.9.47 లక్షలు కాగా, జీటా AMT రూ.10.06 లక్షలకు చేరుతుంది. జీటా CNG MT ధర రూ.10.23 లక్షలుగా ఉంది. ఇక ఆల్ఫా MT ధర రూ.10.79 లక్షలు, ఆల్ఫా AMT రూ.11.38 లక్షలు. కొత్త ఆల్ఫా MT ధర రూ.11.20 లక్షలు కాగా, ఆల్ఫా AMT కోసం రూ.11.84 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఢిల్లీలో పెట్రోల్ వేరియంట్లు చౌక

Advertisement

పెట్రోల్ వేరియంట్ల ఆన్-రోడ్ ధరలను నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో బాలెనో ధరలు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు సిగ్మా MT ధర అక్కడ రూ.6.50 లక్షలుగా ఉంది. డెల్టా MT రూ.7.81 లక్షలు, జీటా MT రూ.8.92 లక్షలు, ఆల్ఫా MT రూ.10.15 లక్షలుగా ఉన్నాయి. ఇదే సమయంలో చెన్నైలో కొన్ని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ల ధరలు ఢిల్లీ కంటే ఎక్కువగా ఉన్నాయి. సిగ్మా MT విషయంలోనే రెండు నగరాల మధ్య దాదాపు రూ.54,000 తేడా కనిపిస్తోంది. ఆల్ఫా MT విషయంలో ఈ వ్యత్యాసం సుమారు రూ.55,000గా ఉంది.

CNGకి ముంబైలో తక్కువ ధర

CNG వేరియంట్ల విషయానికి వస్తే ముంబైలో ధరలు కొంత అందుబాటులో ఉన్నాయి. డెల్టా CNG MT ధర రూ.8.84 లక్షలు కాగా, జీటా CNG MT రూ.9.95 లక్షలుగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇదే వేరియంట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. బాలెనో కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని మారుతి సుజుకి నెక్సా డీలర్ దగ్గర తాజా ఆన్ రోడ్ కోట్ తీసుకోవడం మంచిది.

Read Also: క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

Tags

Related News

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

178 కి.మీ రేంజ్.. 75 కి.మీ స్పీడ్.. BGauss కొత్త స్కూటర్ ఏముంది భయ్యా!

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

ఐఫోన్ 18 డ్యూయో ఫోన్‌కి రూ.4.5 లక్షలా? అదే ధరలో దొరికే 5 కొత్త కార్లు ఇవే!

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×