Niharika Kinidela Dance in Rain : విడాకులు తర్వాత మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ తో పంచుకుంటోంది. అంతేకాదు తరచూ ఫోటో షూట్ కి ఫోజులు ఇస్తూ వాటిని షేర్ చేస్తోంది. అంతేకాదు గ్లామర్ డోస్ కూడా బాగానే పెంచింది. తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. చీరలో వర్షంలో తడుస్తూ అందాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది.
నిర్మాతగా..
కాగా నీహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతోంది. మెగా డాటర్ బిరుదు నుంచి నిర్మాతగా నిహారిక కొణిదెల తన మార్క్ తెచ్చుకోవాలనుకుంటుంది. ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్డ్ గా ఉంది. నటిగా పలు చిత్రాలు చేసిన ఆమె ప్రస్తుతం నటనకు బ్రేక్ తీసుకుంది. నిర్మాతగా మారి వరుస సినిమాలు తెరకెక్కిస్తోంది. సొంతంగా ఆమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ కమిటీ కుర్రాళ్లు అనే సినిమా నిర్మించి మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు సంగీత్ శోభన్ తో రెండో సినిమా చేస్తోంది. ఇందులో ఆమె హీరోయిన్ గా కూడా నటిస్తోంది.
విడాకుల తర్వాత కొత్త జర్నీ
నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికి అతడితో బంధానికి స్వస్తి చెప్పింది. 2020 లాక్ డౌన్ లో నీహారిక, చైతన్యలు పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అతడితో సీక్రెట్ రిలేషన్ లో ఉన్న ఈ మెగా డాటర్.. పెద్దల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఈ వివాహనికి మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలో కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా వేడుకగా నిహారిక, చైతన్యల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలు పక్కన పెట్టి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసింది.
Also Read: Kingdom Ticket Rates: కింగ్ డమ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్
వానలో అందాల మెరుపులు
ఆ కొద్ది రోజులకు నిర్మాత గా అవతారం ఎత్తింది. వివాహం అనంతరం కొంతకాలం ఎంతో అన్యోన్యం గా ఉన్న నిహారిక, చైతన్యలు విడాకులు ప్రకటించారు. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రలో సంచలనంగా మారింది. కొంతకాలం పాటు విడివిడిగా జీవించిన చివరికి విడాకులతో తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. అప్పటి నుంచి ఆమె కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. నిర్మాతగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. సొంతంగా ప్రొడక్షన్ పెట్టి సినిమాలు నిర్మిస్తోంది. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై అలరిస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ మెగా డాటర్ తాజాగా షాకింగ్ వీడియో షేర్ చేసింది. నల్ల చీర కట్టి వానలో తడుస్తూ చిందులేసింది. స్లీవ్ లెస్ జాకెట్, పలుచని చీరలో అందాలు ఆరబోసింది. ఇలా నిహారికను చూసి నెటిజన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు అంటూ ఆమె వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link