UPI Transactions: రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 18% జీఎస్టీ విధించనున్నారనే వార్తలు గత కొన్ని రోజుల క్రిత సోషల్ మీడియాలో తెగ వైరలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌ల వినియోగదారుల్లో ఆందోళన కలిగించాయి. మూడు నెలల క్రితమే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండిచింది.. అయితే తాజాగా.. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్ లో దీనిపై ప్రశ్నలే లేవనెత్తారు.. యూపీఐ పేమెంట్స్ పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించే ఆలోచనలో ఉందా..? అని అడిగారు. అయితే.. ఈ వదంతులను ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. రూ. 2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలపై ఎలాంటి జీఎస్టీ విధించబోమని క్లారిటీ ఇచ్చింది.
యూపీఐ పేమెంట్స్ మనదేశంలో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసింది. దేశంలో యూపీఐ పేమెంట్స్ చాలా పెరిగపోయింది. సామాన్య ప్రజల నుంచి వ్యాపారుల వరకు అందరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. రోజువారీ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో జీఎస్టీ విధింపు వంటి చర్యలు డిజిటల్ చెల్లింపుల వృద్ధికి అడ్డంకిగా మారతాయని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా యూపీఐ సేవలు ప్రస్తుతం పూర్తిగా ఉచితమని, చిన్న లావాదేవీలపై ఎలాంటి రుసుమును విధించడం లేదని స్పష్టం చేసింది.
మార్కెట్లో కూరగాయల కొనుగోలు నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు యూపీఐ ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) డేటా ప్రకారం.. 2025 మే నెలలో 18.68 బిలియన్ యూపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయి. ఇది గత సంవత్సరం మే నెలతో పోలిస్తే 33% వృద్ధిని సూచిస్తుంది. ఈ లావాదేవీల విలువ రూ. 25.14 లక్షల కోట్లుగా ఉంది. ఇది డిజిటల్ చెల్లింపులలో యూపీఐ ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి.
తాజాగా.. రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దని చెప్పింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ట్యాక్స్ విధించబోమని స్పష్టంగా చెప్పింది. ఆర్థిక శాఖ క్లారిటీ ఇవ్వడంతో.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: Thai Cambodia War: శివుడి కోసం యుద్ధం.. థాయ్, కాంబోడియాల గొడవకు కారణాలు ఇవేనా?
ALSO READ: CM Revanth Reddy: చెప్పినట్టే బరాబర్ చేసి చూపించాం.. కాదని ప్రూఫ్ చేయగలరా, ఇదే నా ఛాలెంజ్