Allahe Allaha -Tony Kick: బిగ్ టీవీ(Big tv) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ది బిగ్ ఫోక్ నైట్ 2025 (The Big Folk Night 2025) కార్యక్రమం ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు టికెట్లు కోసం ఎంట్రీవాలా యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇలా బిగ్ టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫోక్ సింగర్లు, డాన్సర్లతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా టోనీ కిక్(Tony Kick) హాజరయ్యి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
హీరోగా టోనీ కిక్…
చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఎంతో ఆసక్తి ఉన్న టోనీ కిక్ కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకొని ఇండస్ట్రీ వైపు వచ్చి కెరియర్ మొదట్లో పలువురు డాన్స్ కొరియోగ్రాఫర్ల దగ్గర పని చేస్తూ డాన్స్ పై పట్టు సాధించారు. అప్పట్లోనే ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో సైడ్ డాన్సర్ గా కూడా పనిచేస్తూ డాన్స్ పై పట్టు సాధించి అనంతరం ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు టోనీ కిక్ సుమారు 300 ఫోక్ సాంగ్స్ చేసినట్లు ఈయన తెలియచేశారు. ఇలా ఫోక్ సాంగ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన టోనీ కిక్ త్వరలోనే హీరోగా వెండి తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.
అల్లా హే అల్లా పాటతో సినిమా …
గత రెండు సంవత్సరాలుగా ఈయన నుంచి పెద్దగా ఎలాంటి పాటలు ప్రేక్షకుల ముందుకు రాలేదు అందుకు కారణం తాను సినిమాకు కమిట్ అవ్వడం వల్లే అభిమానుల ముందుకు రాలేకపోతున్నానని తెలిపారు. ఇప్పటికే తన సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తి అయిందని అతి త్వరలోనే సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కాబోతుందని తెలిపారు. అయితే ఈయన సినిమా మాత్రం “అల్లా హే అల్లా”(Allahe Allaha) అనే పాట మీద రాబోతుందని వెల్లడించారు. అల్లా హే అల్లా సాంగ్ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
టోని ప్రస్తుతం చేస్తున్న సినిమా మొత్తం ఇదే పాట ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు కాబోతుందని తెలియజేశారు. ఇలా హీరోగా వెండితెరపై కనిపించబోతున్న టోనీ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే ఫోక్ ఇండస్ట్రీ వైపు రారా అనే ప్రశ్న కూడా ఎదురవడంతో సినిమా ఇండస్ట్రీలో తనకు ఎంత సక్సెస్ వచ్చిన ఫోక్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే టోనీ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈయన జాను లిరి (Janu Liri)ను పెళ్లి చేసుకోవడం అనంతరం విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది అయితే జాను రెండో పెళ్లి చేసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలతో టోనీ కూడా వార్తల్లో నిలిచారు. ఇక వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నారు. అయితే బాబు ప్రస్తుతం జాను వద్దే ఉంటున్న సంగతి తెలిసిందే.
Also Read: HHVM 2: హరిహర వీరమల్లు 2 పై పవన్ కీలక అప్డేట్.. అప్పుడే షూటింగ్ అంటూ!