Adivi sesh -Jagapathi Babu: అడివి శేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు..అడివి శేష్(Adivi sesh) నటించింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రతి ఒక్క సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నా శేష్ తాజాగా జగపతిబాబు (Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయము రా సీజన్ 2(jayammu Nischayammu raa season 2) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు.
ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా మరొక నటుడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా పాల్గొన్నారు. ఇలా ఈ ముగ్గురు మధ్య సినిమాలకు సంబంధించి పలు సరదా సన్నివేశాలు జరిగాయి. ఇక ఇటీవల అడివి శేష్ ఏ సినిమాలో నటించిన షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా జగపతిబాబు మాట్లాడారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా శేష్ పెళ్లి గురించి కూడా ప్రస్తావనికు వచ్చింది మరి పెళ్లెప్పుడు అంటూ జగపతిబాబు అడగడంతో వెంటనే శేష్ గబ గబా నీళ్లు తాగేశారు కానీ సమాధానం మాత్రం చెప్పలేదు.
ఇకపోతే జగపతిబాబు ఎవరు ఆ అమ్మాయి తన పేరేంటి..M అంటే ఏంటి అంటూ వరుస ప్రశ్నలు వేశారు.. ఇలా జగపతిబాబు అడిగిన విధానం బట్టి చూస్తుంటే అతి త్వరలోనే శేష్ పెళ్లి చేసుకోబోతున్నారని ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు M లెటర్ తో ప్రారంభమవుతుందని స్పష్టం అవుతుంది. ఇక ఈయన కూడా ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని ఈ కార్యక్రమం ద్వారా బయటపడింది . మరి శేష్ ప్రేమలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే గతంలో శేష్ పెళ్లి గురించి ఈయన లవ్ స్టోరీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.
?avpt=MWh0cHFmNTZ2eTNvMw%3D%3D
ఇలా గతంలో శేష్ అక్కినేని ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డతో ప్రేమలో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలలో నిజం లేదంటూ కొట్టి పారేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శేష్ నటించిన మేజర్ సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమా తరువాత సందీప్ ఉన్నికృష్ణన్ ఫ్యామిలీ తన ఫ్యామిలీ అయిందని తన అబ్బాయిని తిట్టినట్టు నన్ను తిడుతూ ఉంటారు వాళ్ళ అబ్బాయికి తినిపించినట్టు నాకు తినిపిస్తూ ఉంటారని శేష్ తెలిపారు. అలాగే సందీప్ ఉన్నికృష్ణన్ ట్రస్ట్ ను అడివి శేష్ దత్తత తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగపతిబాబు బయట పెట్టారు. ఇలా ఈ విషయం తెలిసిన అభిమానులు శేషు మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుస్తుంది.
Also Read: నాగార్జున షో చూడరు..అంతా స్క్రిప్ట్ .. సంచలన విషయాలు బయటపెట్టిన రోహిత్!