E-Paper
Advertisement

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!
Advertisement

Allu Aravind:ఎప్పుడు సరదా సరదా కామెంట్స్ చేసే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చేసిన ఫన్నీ కామెంట్స్ ఇపుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమాలతో పాటు పెళ్లి సంబంధాల బిజినెస్ కూడా మొదలుపెట్టాలంటూ ఓ జర్నలిస్ట్ వేసిన పంచ్‌కు అల్లు అరవింద్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆకాశంలో ఒక తార సక్సెస్ మీట్ జరగగా హీరోయిన్ రుహానీ శర్మ చేసిన బిజిలీ రోల్ గురించి మాట్లాడుతూ సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఈ రోల్ కథను నడిపించడంలో చాలా కీలకంగా మారిందని,ఆడియన్స్ కూడా ఇదే అనుకుంటున్నారని దీనిపై మీ రియాక్షన్ ఏంటి అడిగారు.

Advertisement

దానికి రుహానీ రియాక్ట్ అవుతూ బిజిలీ పాత్రకు ఇంత పెద్ద స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని తాను అస్సలు ఊహించలేదని అయితే షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ క్యారెక్టర్ సినిమాకు ఎంత ముఖ్యమో తమకు అర్థమైందని, ప్రేక్షకులకు ఆ ఎమోషన్స్ సరిగ్గా కనెక్ట్ అయ్యేలా నటించడమే తమ లక్ష్యమని వివరించారు.

ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాసలో మాట్లాడటం తనకు సరికొత్త అనుభూతిని ఇచ్చిందని ,తాను హిందీ మాట్లాడే అమ్మాయినని, కొత్త కొత్త యాసలను ఇమిటేట్ చేయడం తనకు మొదటి నుంచి ఇష్టమని చెప్పారు. ఇక బిజిలీ పాత్ర కోసం తన ఇంట్లో పనిచేసే వాళ్ల మాటతీరును గమనించడంతో పాటు, బయట అలాంటి యాసలో మాట్లాడే వ్యక్తులను బాగా స్టడీ చేశానని చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే అలా మాట్లాడుతుండగానే మధ్యలో అల్లు అరవింద్ కలగజేసుకుని ఈ మధ్యే ఓ పార్టీలో రుహానీ శర్మ కలిసినప్పుడు, హైదరాబాద్ అబ్బాయిలను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా అని తాను సరదాగా సలహా ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. గతంలో కూడా కొంతమంది హీరోయిన్లకు ఇలాగే చెప్పానని, అందులో కొందరు నిజంగానే హైదరాబాద్ అబ్బాయిలని పెళ్లి చేసుకున్నారని అన్నారు. అయితే ఆ మాటలతో తన సొంత కుటుంబంలోకే కొత్త బంధాలు వస్తాయని అప్పుడు తాను ఊహించలేదని అసలు విషయం బయటపెట్టారు.

ఇక అల్లు అరవింద్ మాటలకు రుహానీ శర్మ రియాక్ట్ అవుతూ అలా జరగడం ఒక ఆశీర్వాదం అని అనగా, ఇంతలో అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే పెళ్లి సంబంధాలు కుదిర్చే బిజినెస్ కూడా పెడితే బాగుంటుందని సరదాగా సలహా ఇచ్చారు. సినిమా ప్రొడక్షన్ తో పాటు మ్యారేజ్ బ్యూరో కూడా నడిపితే మరో మంచి బిజినెస్ అవుతుందని సెటైర్ వేశారు. దీనికి అల్లు అరవింద్ వెంటనే తప్పకుండా మొదలుపెడదాం అనగానే ఆడిటోరియం ఒక్కసారిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది.మొత్తానికి ఏజ్ పెరిగినా ఇంకా తనది చిన్న పిల్లాడి మనసత్వమే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్ !

ALSO READ:అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

Tags

Related News

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!

75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!

కుండబద్దలు కొట్టిన అనంత శ్రీరామ్.. ‘పెద్ది’ వివాదంపై సంచలన వ్యాఖ్యలు!

ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చిన ‘అలియాస్ రుక్మిణి’..ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!

Big Stories

Advertisement
×