E-Paper
Advertisement

75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!

75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!
Advertisement

Malliswari Movie:‘మల్లీశ్వరి’..తెలుగు సినిమా హిస్టరీలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ఈ సినిమా గురించి సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే ఎపిసోడ్ లో పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, భానుమతి జంటగా బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో 1951లో వచ్చిన ఈ సినిమాకు దాదాపు 75 ఏళ్లు నిండుతున్నా, ఇప్పటికీ దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఆకాశానికి ఎత్తేశారు.

సాధారణంగా పాత సినిమాలు చూస్తుంటే ఇప్పటి ఆడియన్స్ కి స్లో గా అనిపిస్తాయి కాని , కానీ మూడు గంటలకు పైగా లెంత్ ఉన్న ‘మల్లీశ్వరి’ చూస్తుంటే మాత్రం అసలు సమయమే తెలియదని తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు తమ్మారెడ్డి.అందుకు ప్రధాన కారణం దర్శకుడు బి.ఎన్. రెడ్డి రాసుకున్న అద్భుతమైన స్క్రీన్‌ప్లే అని పొగిడేశారు.

Advertisement

ఇక ఈ సినిమాలో చిన్నప్పటి మల్లి, నాగరాజు పాత్రలు ప్రవర్తించిన తీరుకి పెద్దయ్యాక వచ్చే ఎన్టీఆర్, భానుమతిల ఎక్స్ ప్రెషన్స్ కి మధ్య దర్శకుడు చూపించిన పోలికలు అద్భుతమని వివరించారు. చిన్నప్పటి మల్లి ఎలాగైతే నడుస్తుందో, మాట్లాడుతుందో పెద్దయ్యాక భానుమతి కూడా సరిగ్గా అలాగే కనిపిస్తుందని, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే సినిమాకు ఎంతో న్యాచురాలిటీని తీసుకొచ్చాయని అలాగే మల్లి, నాగరాజుల లవ్ స్టోరీ,అది బ్రేకప్ అయిన తీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో అనే ఎగ్జైట్ మెంట్ ని దర్శకుడు చాలా బాగా చూపించాడని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా మల్లిని రాణివాసానికి తీసుకెళ్లడానికి పల్లకి వచ్చినప్పుడు ఊరంతా పండుగ చేసుకుంటుంటే, కూతురు తమకు దూరమవుతుందన్న బాధలో మల్లి తండ్రి, కంగారులో పూజారి కనిపించడం వంటి సీన్స్ ఆడియన్స్ మనసుల్ని హత్తుకుంటాయన్నారు. ఇక కూతురు బాగుండాలని తల్లి ఆశపడటంలో తప్పు లేదని, అందుకే ఈ సినిమాలో ఏ పాత్రనూ చెడ్డగా చూపించకుండా అందరి ఎమోషన్స్ కి విలువ ఇచ్చారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.

Advertisement

ఇక సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం, దేవులపల్లి కృష్ణశాస్త్రి లిరిక్స్ భానుమతి పాడిన తీరు ప్రాణం పోశాయని అన్నారు. ‘మనసున మల్లెల’, ‘ఆకాశ వీధిలో’ వంటి పాటలు ఇప్పటికీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయని ముఖ్యంగా మేఘ సందేశం పాటలో ఎలాంటి మూమెంట్స్ లేకపోయినా కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేమికుల మధ్య విరహాన్ని అద్భుతంగా పండించారని ఆకాశానికి ఎత్తేశారు.ఇక ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లోనే హంపీ విరూపాక్ష దేవాలయం, విజయనగర రాజరిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో కెమెరామెన్లు, కళా దర్శకుడు తోట సుబ్బారావు పడిన కష్టం మాములుది కాదని మెచ్చుకున్నారు.

బుచ్చిబాబు రాసిన ‘రాయలవారి కరుణకృత్యం’ రేడియో నాటకం ఆధారంగా తీసిన ఈ సినిమా లో ‘మన కష్టాలు మన పనికి అడ్డం రాకూడదు నాయనా’ అనే డైలాగ్ లైఫ్ కి ఒక గొప్ప మెసేజ్ ఇస్తుందని గుర్తుచేశారు. ఇక క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, భానుమతి కలుసుకున్నప్పుడు మాటల కంటే వారి కళ్ళే ఎక్కువగా మాట్లాడతాయని, భానుమతి స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని అన్నారు. భారీ బడ్జెట్లు, గ్రాఫిక్స్ లేకపోయినా కేవలం మంచి కథ, సంగీతం, నటన ఉంటే ఒక సినిమా తరతరాల పాటు నిలిచిపోతుందని ‘మల్లీశ్వరి’ నిరూపించిందని తనదైన శైలిలో విశ్లేషించారు తమ్మారెడ్డి !

ALSO READ:ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Tags

Related News

EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!

కుండబద్దలు కొట్టిన అనంత శ్రీరామ్.. ‘పెద్ది’ వివాదంపై సంచలన వ్యాఖ్యలు!

ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చిన ‘అలియాస్ రుక్మిణి’..ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!

ఎవరూ ఊహించని కలెక్షన్స్.. ఈఎన్ఈ రిపీట్ దూకుడు మామూలుగా లేదుగా!

‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. బయటపెట్టిన రాజ్ పిన్నమ్మ!

Big Stories

Advertisement
×