Akhil Zainab:మొన్నటిదాకా లెనిన్ షూటింగ్ తో తెగ బిజీగా గడిపేసిన ఇపుడు తన భార్య జైనబ్ రవద్జీతో కలిసి ఫారిన్ టూర్ లో రచ్చ చేస్తున్నాడు.ఈ క్రమంలో తాజాగా ఈ జంట జపాన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మౌంట్ ఫుజి పర్వత ప్రాంతంలో దిగిన ఒక ఫొటోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకొచ్చాడు.దీంతో మా అయ్యగారు మాంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఈ ఫొటోలో జపాన్ ప్రకృతి అందాలు హైలెట్ అని చెప్పాలి. సూర్యుడు ఒకపక్క, వెనుకవైపు మౌంట్ ఫుజి పర్వతం.. ఇవన్నీ కలిసి అన్నీ కలిసి ఫోటోని ఒక పెయింటింగ్‌లా మార్చేశాయనే చెప్పాలి .చుట్టూ పచ్చని చెట్లు, పక్కనే గా ఉన్న లేక్ ,మధ్య అఖిల్, జైనబ్ హ్యాపీగా గడిపేస్తున్నారని ఫొటో చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా అఖిల్ వింటర్ జాకెట్, తలకు స్టైలిష్ హెడ్‌బ్యాండ్ ధరించి ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటే, జైనబ్ కూడా క్యూట్‌గా కనిపిస్తూ అభిమానులని ఫిదా చేసేసింది.
అన్నింటి కన్నా ముఖ్యంగా అఖిల్ నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటుంటే జైనబ్ అఖిల్ చెంపపై ముద్దు పెడుతున్న ఫోజ్ ఫొటోకే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి.ఇక పెద్దగా హడావిడి లేకుండా కేవలం ‘Fuji – san #japan #mountfuji’ అంటూ చిన్న క్యాప్షన్‌తో తన సంతోషాన్నిషేర్ చేసుకున్నాడు అఖిల్.ఇక ఈ కొత్త జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
ఇక సినిమాల విషయానికి వస్తే’అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘హలో’ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలతో యూత్ కి దగ్గరైనప్పటికీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.
ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఏజెంట్’ సినిమా ఎటు వెళ్ళిపోయిందో తెలీదు.ఒక రకంగా ఈ సినిమా అఖిల్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసిందని చెప్పాలి. అయితే దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన లెనిన్ సినిమా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఏకంగా వంద కోట్ల వసూల్లని కొల్లగొట్టడంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.
ALSO READ:EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!
మొత్తానికి ఒకవైపు ‘లెనిన్’ సినిమాతో సాలిడ్ హిట్ ని చూసిన అఖిల్, మరోవైపు పర్సనల్ లైఫ్ ని ఫారిన్ టూర్లతో ఎంజాయ్ చేస్తున్నాడన్న మాట. చూడాలి మరి సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ కుర్ర హీరో ముందు ముందు ఎలాంటి సినిమాలతో అలరిస్తాడో !