Anantha Sriram:అనంత శ్రీరామ్..తెలుగు సిని ఇండస్ట్రీలో ఈయనకి పాటల రచయితగా ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ఆయన రాసే పాటల్లో ప్రేమ, ఎమోషన్స్, కి ఆయన అద్దే పదాలు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయని చెప్పాలి.అయితే పదాలతోనే కాకుండా అప్పుడప్పుడు వివాదాలతో కూడా ఆయన వార్తల్లో నిలుస్తుంటారని చెప్పక్కర్లేదు.ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా వివాదాలు, డైరెక్టర్ బుచ్చిబాబు ఎదుర్కొన్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ,పురాణాలలోని పాత్రల వంటి విషయాలపై అనంత శ్రీరామ్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.మొదట్లో తన అభిప్రాయాలను ఓపెన్‌గా చెప్పడానికి అంత ధైర్యం లేకపోయినా, ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ తనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని, ఇప్పుడు తనకు అనిపించింది ఉన్నదున్నట్లు మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
ఇక రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా పాటల గురించి మాట్లాడుతూ ఐటమ్ సాంగ్ లిరిక్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన డిస్కషన్ తనకు అస్సలు నచ్చలేదని ఒక పాటను పూర్తిగా వినకముందే, సినిమా రిలీజ్ కాకముందే కొందరు నెగెటివ్ ప్రచారం చేయడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని తన మనసులోని మాటని బయటపెట్టారు.ఒక యంగ్ డైరెక్టర్ తన రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో పనిచేస్తూ ఒక ప్రయత్నం చేస్తుంటే, ఎంకరేజ్ చేయాల్సింది పోయి విమర్శలతో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు.
ఈ సందర్భంగా ‘పెద్ది’ కలెక్షన్ల పోస్టర్ గురించి మాట్లాడుతూ ఆ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసిన సందర్భంగా మొదట్లో జరిగిన నెగెటివ్ ప్రచారానికి, ఆడియన్స్ రెస్పాన్స్‌కు అస్సలు సంబంధం లేదని చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ ఒక్కరికే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరి కష్టం ఇందులో ఉందని గుర్తుచేశారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సారీ చెప్పడం గురించి చెబుతూ ఒక సినిమా అనేది డైరెక్టర్ ఆలోచనల నుంచి వస్తుందని, నచ్చకపోతే ఆడియన్స్ తమ అభిప్రాయం చెప్పొచ్చు లేదా సినిమా చూడకుండా ఉండొచ్చు కానీ, ఒక డైరెక్టర్ అలా పబ్లిక్ గా సారీ సోషల్ మీడియాలో ప్రెజర్ తేవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు కష్టపడే వ్యక్తి శ్రమను ఒక్క నెగెటివ్ కామెంట్‌తో తక్కువ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
అలాగే పౌరాణిక కథల ఆధారంగా వస్తున్న సినిమాలపై మాట్లాడుతూ ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో తన అభ్యంతరం ప్రభాస్ మీద కాదని, ఎన్టీఆర్ అంటే కూడా తనకు ఎంతో అభిమానమని క్లారిటీ ఇచ్చారు. అయితే మహాభారతం లాంటి ఇతిహాసాల్లోని క్యారెక్టర్లను సినిమా కోసం పూర్తిగా మార్చేయడం తనకు నచ్చదన్నారు. కర్ణుడి పాత్రను ఉదాహరణగా చెబుతూ, ఒరిజినల్ కథలోని క్యారెక్టర్ల స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఒకరిని మరీ గొప్పగా, మరొకరిని తప్పుగా చూపించడం సరికాదన్నారు.మొత్తంగా అనంత శ్రీరామ్’పెద్ది’ వివాదంపై, పురాణాలలోని పాత్రపై చేసిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి !
ALSO READ:ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!