E-Paper
Advertisement

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !
Advertisement

Sudhakar:సుధాకర్..అక్కుం బక్కుం అంటూ కమెడీయన్ గా వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని అలరించిన ఈ వెటరన్ స్టార్ కమెడీయన్ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా సుధాకర్ కొడుకు బెన్నీ ఆలోచన సినిమాతో ఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమా నవంబర్ 27న ఆడియన్స్ ముందు వచ్చేందుకు రెడీ అయిపొయింది.ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న బెన్నీ తండ్రి సుధాకర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

హీరోగా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత కమెడియన్‌గా స్టార్ స్టేటస్ చూసిన సుధాకర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో తన మార్క్ కామెడీతో మెప్పించిన సంగతి తెల్సిందే.అయితే 2003-04లో వచ్చిన ‘సంక్రాంతి’ సినిమా తర్వాత ఆయనకు ఛాన్స్ లు బాగా తగ్గిపోయాయని గుర్తుచేసుకున్నాడు బెన్నీ.

Advertisement

ఇక సుధాకర్ అనారోగ్యం గురించి చెబుతూ సుధాకర్‌కు మొదటి నుంచీ షుగర్ సమస్య ఎక్కువగా ఉండేదని,హాస్పిటల్ లో చేరడానికి ముందు రోజు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేసుకున్నాడు. ఆసుపత్రిలో చేరిన మొదట్లో బాగానే మాట్లాడినప్పటికీ, రాత్రికి రాత్రే పరిస్థితి సీరియస్ అయి కోమాలోకి వెళ్లిపోయారని తెలిపాడు.

అప్పుడు తను పదో తరగతి చదువుతున్నానని ఇంట్లో వాళ్లు ఆ నిజాన్ని దాచి, నాన్నకు ఏం కాలేదు త్వరలోనే తిరిగి వస్తారని ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నాడు.అలా దాదాపు నెల రోజుల పాటు సుధాకర్ కోమాలోనే ఉన్నాడని ఆ సమయంలో చిరంజీవి, జగపతిబాబు లాంటి స్టార్స్ ఆసుపత్రికి వచ్చి చాలాసేపు ఉండి కుటుంబానికి అండగా నిలిచారని చెప్పి తన కృతజ్ఞతని చూపించాడు.

Advertisement

ఇక చాలామంది అనుకుంటున్నట్లు సుధాకర్ అనారోగ్యం వల్ల ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా పూర్తిగా దివాలా తీయలేదని క్లారిటీ ఇచ్చాడు బెన్నీ.ఆ సమయంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తన తండ్రి కెరీర్‌లో సంపాదించుకున్న దానివల్ల తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులేవీ రాలేదని చెప్పాడు.

ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్యం బాగానే ఉందని, కాకపోతే శారీరకంగా షూటింగ్‌లలో పాల్గొనడం కష్టం కాబట్టి ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారని అన్నాడు. ఇక తన తల్లి దండ్రులకి 1983లో పెళ్లయితే కు 1995లో తాను పుట్టానని పుట్టినప్పటి నుంచే సుధాకర్‌ సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గించి తనపైనే ఫోకస్ పెట్టారని చెప్పుకొచ్చాడు.

ఇక బెన్నీ చిన్నప్పుడు బ్రహ్మానందం ఇంటికి వచ్చి చాక్లెట్లు ఇస్తూ సరదాగా ఆడుకునేవారని, చిరంజీవి తనను ఎత్తుకుని బాస్కెట్ బాల్ ఇచ్చిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయని చెప్పాడు. చెన్నైలో జరిగిన తన మొదటి పుట్టినరోజుకు చిరంజీవి, బాలకృష్ణ, బ్రహ్మానందం లాంటి హేమాహేమీలంతా వచ్చారని గుర్తుచేసుకున్నాడు.

తన కెరీర్ విషయానికి వస్తే, తండ్రి పేరు చెప్పుకుని కాకుండా సొంతంగా ఎదగాలని బెన్నీ ఆడిషన్స్‌కు వెళ్లేవాడినని, రామ్ గోపాల్ వర్మ దగ్గర రైటర్‌గా అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు, వర్మ స్వయంగా సుధాకర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారని చెప్పాడు. ముందు దర్శకత్వం వైపు వెళ్లాలనుకున్నా, తండ్రి సలహాతో ఇప్పుడు పూర్తిగా నటన మీదే దృష్టి పెట్టానని తెలిపాడు. దర్శకుడు చాచా మొదట సుధాకర్ కోసం రాసుకున్న పాత్రను ఆయన రిజెక్ట్ చేయడంతో, ఆ అవకాశం తనకి దక్కి ‘ఆలోచన’ సినిమాలో నటించానని గుర్తు చేసుకున్నాడు బెన్నీ !

ALSO READ:గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

Tags

Related News

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!

75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!

కుండబద్దలు కొట్టిన అనంత శ్రీరామ్.. ‘పెద్ది’ వివాదంపై సంచలన వ్యాఖ్యలు!

ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చిన ‘అలియాస్ రుక్మిణి’..ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!

Big Stories

Advertisement
×