Manchu Lakshmi: దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈడీ విచారణను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ.. అమాయకపు యువతను తప్పుదారి పట్టిస్తున్నారనే ఉద్దేశంతో.. ఇదంతా గమనించిన కేంద్రం వెంటనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని హెచ్చరించి, ఈడీ విచారణకు రావాలని కోరింది. ఇప్పటికే మంచు లక్ష్మి(Manchu Lakshmi), ప్రకాష్ రాజ్(Prakash Raj), రానా(Rana), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి సెలెబ్రెటీలు ఈడీ ముందు విచారణకు హాజరైన సంగతి మనకు తెలిసిందే. అయితే చివరిగా మంచు లక్ష్మి ఈడీ విచారణలో పాల్గొంది. అయితే ఈడీ బెట్టింగ్ యాప్స్ కేసు పై, ఈడీ విచారణపై మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది మంచు లక్ష్మి.
ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చేసిన కామెంట్లు మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి. జరిగింది ఒక్కటైతే చూపించేది మరొక్కటి అంటూ ఆమె మీడియాపై ఫైర్ అయింది. మరి ఇంతకీ మంచు లక్ష్మి రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందు వల్ల కొంతమంది ప్రముఖులకు ఈడీ ముందు విచారణకు హాజరుకావ్వాల్సిందిగా నోటీసులు వెళ్లాయి. అలా దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లు ఈడీ ముందు హాజరయ్యారు. అయితే మంచు లక్ష్మి కూడా రీసెంట్ గానే ఈడీ విచారణలో పాల్గొంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ.. “ఈ నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కడినుండి స్టార్ట్ అవుతుంది అనేది అధికారులు ముందుగా గుర్తించాలి. ఇది గుర్తించకుండా ఈ కేసులో చిట్ట చివరి వ్యక్తిని విచారించాలి అనుకోవడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ స్టార్ట్ అయిందో వదిలేసి చివరి వ్యక్తిని పట్టుకుంటే ఏం వస్తుంది.
also read:Aishwarya Rai: ఐశ్వర్య ఫోటోలు వాడకంపై హైకోర్టు కీలక నిర్ణయం.. ఏమన్నారంటే?
మీడియాపై మండిపడ్డ మంచు లక్ష్మీ..
ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మీడియా నా మీద దుష్ప్రచారం చేసింది. అక్కడ జరిగింది ఒక్కటైతే మీడియాలో మరో రకంగా చూపించారు. మేం ఈడీ ముందు ఒక విషయం గురించి హాజరైతే మీడియా దాన్ని వక్రీకరించింది. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు చూసి నేను చాలా బాధపడ్డాను. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో డబ్బు ఎక్కడి నుండి వస్తుంది.. ఎక్కడికి వెళ్తుంది..ఎలా సమకూరుతుంది? అనే ప్రతి ఒక్క విషయం గురించి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నుండి ఉగ్రవాదులకు ఏమైనా డబ్బులు వెళ్తున్నాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.కానీ ఈ విషయాలు ఏమీ నాకు ఎక్కువగా తెలియదు.
వందమందిలో ఒకరిని..
అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ని దాదాపు 100 మంది ప్రమోట్ చేశారు. అందులో నేను కూడా ఒకదానిని ఉన్నాను. ఇది ఒక్క నిమిషం పని అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు అంగీకరించింది. అంతేకాదు అసలు ఇలాంటి యాప్ లు ఎక్కడినుండి స్టార్ట్ అవుతున్నాయి..వీటి ఉనికి ఏంటి అని అధికారులు ఎందుకు తెలుసుకోవడం లేదంటూ కూడా మండి పడింది. ఇక బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కున్న మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడి ముందు హాజరైంది. అలా మొదటిసారి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసు గురించి తాజా ఇంటర్వ్యూలో స్పందించింది మంచు లక్ష్మి.