Aishwarya Rai: ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ గా కూడా పేరు సొంతం చేసుకుంది. ఒకవైపు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేస్తూనే.. మరొకవైపు బ్రాండ్ అంబాసిడర్ గా పలు ఉత్పత్తులకు వ్యవహరిస్తూ.. మరింత ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఇమేజ్ కి ఇప్పుడు భంగం కలిగించేలా కొంతమంది ఈమె ఫోటోలను తప్పుగా వాడుతూ.. సమాచారాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ.. లాయర్ తరఫున ఐశ్వర్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇలా అనుమతి లేకుండా ఈమె ఫోటోలు వాడకంపై ఢిల్లీ హైకోర్టు కీలక కామెంట్లు చేసింది.
ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ఐశ్వర్యారాయ్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఐశ్వర్యరాయ్ ఫోటోలు ఉపయోగించకూడదని.. ఒకవేళ ఉపయోగిస్తే శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది అని హెచ్చరికలు జారీ చేసింది. ఐశ్వర్యరాయ్ ఫోటోలు దుర్వినియోగం చేయడం వల్ల ఆమెకు ఆర్థికంగా కూడా నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవానికి, ప్రతిష్టకు దెబ్బ కలిగించినట్లేనని స్పష్టం చేసింది. ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా కోర్టు హామీ ఇవ్వడం గమనార్హం.. అంతేకాదు విచారణలో భాగంగా ఐశ్వర్య పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం అందులో గుర్తించిన యు ఆర్ ఎల్ ను వెంటనే తొలగించి, బ్లాక్ చేయాలని.. అటు ఈ కామర్స్ వెబ్సైట్లతో పాటు గూగుల్ సహా ఇతర ప్లాట్ ఫామ్ లోకి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
72 గంటల్లోపే జరిగిపోవాలి..
యు ఆర్ ఎల్ ఉపయోగించిన వెబ్సైట్లకు నోటీసులు అందిన 72 గంటల్లోనే పిటిషన్ లో ఐశ్వర్య పేర్కొన్నట్టుగా యుఆర్ఎల్ బ్లాక్ చేయాలి అని.. ఇక 7 రోజులలో బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అని కేంద్రం ఐటి, సమాచార శాఖకు కూడా సూచించింది .ఇక తదుపరి విచారణను వచ్చే యేడాది జనవరి 15 కు వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. మొత్తానికి అయితే ఐశ్వర్యరాయ్ ఫోటోలు తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారని చెప్పి కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు భారీ ఊరట కలిగింది.
మధ్యవర్తి సహాయంతో హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్..
అసలు విషయంలోకి వెళ్తే.. గత రెండు రోజుల క్రితం ఐశ్వర్యరాయ్ తన ఫోటోలను, వీడియోలను తన అనుమతి లేకుండా అశ్లీల కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారు అంటూ తన తరఫు న్యాయవాది సందీప్ సేథీ సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది.” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఐశ్వర్య ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ముఖం వాడుకొని డబ్బు సంపాదిస్తున్నారు..”ఐశ్వర్య నేషన్ వెల్త్” అనే ఒక సంస్థ తమ లెటర్ హెడ్ పై ఆమె ఫోటోని ముద్రించి, ఆమెను ఆ సంస్థకు చైర్ పర్సన్ గా తప్పుగా చూపించింది” అంటూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఐశ్వర్య ఫోటోలను టీ షర్టులపై, వాల్ పేపర్లపై కూడా ముద్రించి అమ్ముతూ.. ఆమె ఇమేజ్ ను మరింత దిగజారిస్తున్నారని కోర్టును ఆశ్రయించడం జరిగింది.
also read:Bigg Boss 9:మొదటి వారమే డబుల్ ట్విస్ట్… ఫస్ట్ వారమే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ ?