లిక్కర్ గోడౌన్ డాబా పేరుతో అనుమతులు తీసుకొని ఆ తర్వాత.. లిక్కర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసి అత్యంత చీప్ లిక్కర్ తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆట్లాడుతున్నారు. గత 6నెలలుగా అద్దేపల్లి జనార్దన్‌రావు ఏకంగా తమిళనాడు నుంచి కూలీలు తీసుకొచ్చి వారితో నకిలీ మద్యాన్ని తయారు చేయించి లిక్కర్ అమ్మకాలు సాగించాడు. అందుకోసం స్థానికంగా ఉన్న టిడిపి ఇంచార్జ్ జయచంద్రారెడ్డితో ఉన్న సంబంధాలను అనువుగా మార్చుకున్నాడు అద్దేపల్లి జనార్దన్ రావు.