Srinidhi shetty: శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)ప్రస్తుతం తెలుసు కదా(Telusu Kada) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న ఈమె కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈమె సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ రాశి కన్నా కూడా భాగమైన సంగతి తెలిసిందే.
ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీకు ఒకేసారి ఎన్టీఆర్(NTR) అలాగే మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేసే అవకాశాలు వస్తే మీరు ఏ హీరోతో సినిమా చేయాలని కోరుకుంటారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్రీనిధి సమాధానం చెబుతూ తాను ఇద్దరు హీరోలతో నటించే అవకాశాన్ని అసలు వదులుకోనని తెలిపారు.
ఒకేసారి తనుకు మహేష్ బాబు ఎన్టీఆర్ తో అవకాశం వస్తే కచ్చితంగా ఇద్దరు హీరోలతోనూ సినిమా చేస్తానని ఆ సినిమాల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పని చేస్తానని తెలియజేశారు. మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం రావడం కోసం ఎంతో మంది సెలబ్రిటీలు ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఇద్దరి సినిమాలలో ఒకేసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందగా, మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక తెలుసు కదా సినిమా విషయానికి వస్తే.. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ పలు అప్డేట్స్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం పై విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పటివరకు విడుదల చేసిన పాటలు కానీ ఇతర అప్డేట్స్ కానీ మంచి అంచనాలను పెంచేసాయి.
Also Read: Rishabh shetty: కాంతార1 లో రిషబ్ శెట్టి భార్య పిల్లలు కూడా ఉన్నారా…అసలు కనిపెట్టలేరుగా?