E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2కు 70 కోట్ల ఫైనాన్స్ ఇష్యూ.. ఎవరికి ఎంత ఇవ్వాలంటే..?

Akhanda 2: అఖండ 2కు 70 కోట్ల ఫైనాన్స్ ఇష్యూ.. ఎవరికి ఎంత ఇవ్వాలంటే..?
Advertisement

Akhanda 2: అఖండ తాండవం ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ చివరి నిమిషంలో నిర్మాతల నుంచి ఊహించని సమాధానం రావడంతో ఒక్కసారిగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ(Balakrishna) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) కాంబినేషన్లో సినిమా అంటేనే ఆ సినిమాకు ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అలాంటిది అఖండ 2(Akhanda 2) సినిమాని ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే ఈ సినిమా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అఖండ 2 కు ఫైనాన్స్ ఇబ్బందులు..

సినిమా విడుదలకు కేవలం గంటల వ్యవధి సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీమియర్లు క్యాన్సిల్ అంటూ బాంబు పేల్చారు. ఇక చివరి నిమిషంలో ఈ సినిమా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది అంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి సాంకేతిక లోపాలు కాదని, ఫైనాన్సు ఇబ్బందులని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల కావాలి అంటే నిర్మాతలు 70 కోట్ల రూపాయలు ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే విడుదల అవుతుందని తెలుస్తోంది. అఖండ 2 సినిమాకు మొత్తం ముగ్గురు ఫైనాన్షియర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకున్నట్టు సమాచారం.

రూ. 70 కోట్లు ఇస్తేనే సినిమా విడుదల..

Advertisement

అఖండ 2 సినిమా విడుదల కావాలి అంటే వీళ్లకు ఇవ్వాల్సిన మొత్తం 70 కోట్లు చెల్లిస్తేనే ఫైనాన్షియర్లు NOC సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడే ఈ సినిమా విడుదలకు వీలవుతుంది. ఇకపోతే నిర్మాతలు ఈ విషయాన్ని బాలకృష్ణ వద్ద చెప్పకుండా దాచి పెట్టారట. సినిమా విడుదలైన తర్వాత ఈ ఫైనాన్షియర్ల ఇష్యూ క్లియర్ చేయచ్చని నిర్మాతలు భావించారు కానీ ఫైనాన్షియర్లు మాత్రం ముందే డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం బాలకృష్ణ వద్దకు వెళ్లిందని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణకు చివరి నిమిషంలో ఈ విషయాన్ని వెల్లడించడంతో బాలయ్య నిర్మాతల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

బాలకృష్ణ లాంటి ఒక సీనియర్ హీరో కెరియర్ లో ఇప్పటి వరకు చివరి నిమిషంలో సినిమా ఆగిపోయిన సందర్భాలు ఎక్కడ చోటు చేసుకోలేదు. మొదటిసారి బాలయ్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న ఆనందంలో అభిమానులు ఉన్నారు ఇలాంటి తరుణంలో సినిమాని చివరి నిమిషంలో వాయిదా వేయడం వెనుక కుట్ర ఉంది అంటూ బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే ముందే చెప్పచ్చు కదా ఇలా చివరి నిమిషంలో వాయిదా వేయడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని బాలయ్య సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×