E-Paper
Advertisement

శాలిని ప్రపోజల్.. తెగ సిగ్గుపడిపోయిన రోహిత్..మ్యాటర్ ఏంటి బ్రో?

శాలిని ప్రపోజల్.. తెగ సిగ్గుపడిపోయిన రోహిత్..మ్యాటర్ ఏంటి బ్రో?
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ 10(Bigg Boss 10 ) కంటెస్టెంట్ రోహిత్ నాయుడు( Rohit Naidu Patnam) పట్నం పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రోహిత్ బిగ్ బాస్ జర్నీ గురించి ఆయన ఎలిమినేషన్ గురించి అలాగే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ గురించి వస్తున్న విమర్శల పట్ల కూడా స్పందిస్తూ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఇక రోహిత్ షాలిని ఐ లవ్ యు చెప్పడం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారని తెలుస్తోంది.

ఎనిమిదవ వారం రోహిత్ ఎలిమినేషన్..

రోహిత్ నాయుడు అగ్నిపరీక్ష ద్వారా ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈయన మొదటి వారం నుంచి అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఓటింగ్ పరంగా టాప్ లో దూసుకుపోతూ వచ్చారు. కచ్చితంగా విన్నర్ రోహిత్ అవుతారని చాలామంది భావించారు కానీ బిగ్ బాస్ ఊహించని విధంగా రోహిత్ నాయుడుని ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు పంపించిన సంగతి తెలిసిందే. ఇలా హౌస్ లో 8 వారాలపాటు కొనసాగిన రోహిత్ మరొక కంటెస్టెంట్ శాలినితో చాలా చనువుగా కొనసాగారు.

చెవిలో ఐ లవ్ యు చెప్పిన శాలిని..

Advertisement

ఇలా శాలిని రోహిత్ మధ్య బాండింగ్ చూసిన ప్రేక్షకులు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందని వీరు లవ్ లో ఉన్నారని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లో శాలిని రోహిత్ ను హగ్ చేసుకుని తనకు చెవిలో ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయం గురించి కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో వర్ష ప్రశ్నించారు. ఇలా సీక్రెట్ రూమ్ నుంచి శాలిని వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుని చెవిలో ఐ లవ్ యు చెప్పింది కదా.. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రోహిత్ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోయారు. అనంతరం ఏదో తేడా కొడుతోంది సీన అంటూ రోహిత్ మాట్లాడారు.

Advertisement

ఇలా శాలిని పేరు చెప్పగానే రోహిత్ సిగ్గుపడటంతో నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారా? అందుకే రోహిత్ అలా శాలిని పేరు వినగానే సిగ్గు పడుతున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రోహిత్ షాలినితో తన రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని మా మధ్య ఇంకెలాంటి బాండింగ్ లేదని తెలిపారు. ఇలా ఫ్రెండ్ గా మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ తెలియజేశారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా షాలిని గురించి రోహిత్ ఏం చెప్పారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!

Related News

త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!

ప్రియుడు శివ్ కోసం తిరుమలలో మోకాళ్లపై మెట్లెక్కిన ప్రియాంక జైన్!

ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు.. అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటున్న రోహిత్!

ఇది బిగ్ బాస్ కాదురోయ్ ..మాటలతో రెచ్చిపోయిన రోహిత్- అపూర్వ!

చిన్న కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ 10 కంటెస్టెంట్.. ఎంత ముద్దుగా ఉందో!

బిగ్ బాస్ లోకి రాకముందు రోహిత్ నాయుడు జీతం ఎంతో తెలుసా?

వైష్ణవి సోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. వరుసగా హిట్ల మీద హిట్లు!

Big Stories

Advertisement
×