BigTV English

Allu Arha: రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్హ… పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్?

Allu Arha: రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్హ… పాన్ ఇండియా హీరో సినిమాలో ఛాన్స్?

Allu Arha: సినీ ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి(Allu Family) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు రామలింగయ్య కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన తర్వాత అల్లు అరవింద్ అల్లు అర్జున్(Allu Arjun) వంటి వారందరూ కూడా ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.


శాకుంతలం సినిమాలో భరతుడిగా..

ఇలా ఈ మూడు తరాలు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకోగా నాలుగో తరం వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ(Allu Arha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దు ముద్దు మాటలతో ఎంతో క్యూట్ గా కనిపించే అర్హ ఇదివరకే వెండితెరపైకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల పరిణయం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం(Shaakunthalam) సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి సందడి చేశారు.


అల్లు అర్జున్ సినిమాలో అర్హ?

ఇలా మొదటి సినిమాతోనే తన నటనతో అదరగొట్టిన అర్హకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయని తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ తన కుమార్తెను తదుపరి సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించని నేపథ్యంలో అర్హ కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అర్హ రెండో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈసారి ఈమె పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో భాగం కాబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అర్హ రెండో సినిమా ఏ హీరోతో నటిస్తున్నారని విషయానికొస్తే ఆయన మరెవరో కాదు అర్హ తండ్రి అల్లు అర్జున్ సినిమాలోనే ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త విన్న అల్లు అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నలుగురిని రంగంలోకి దింపిన అట్లీ…

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్ , దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, రష్మిక నటించబోతున్నారు ఇక రష్మిక మందన్న విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో అర్హ నటించబోతోంది అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.

Also Read: War 2 Film: వార్ 2 శుభం కాదు..ఆరంభం… సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్?

Related News

Raghava Lawrence : డౌన్ సిండ్రోమ్ పీపుల్ కు రాఘవ లారెన్స్ సేవ, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Pawan Kalyan: హృతిక్ అయినా.. ఖాన్స్ అయినా.. పవన్ ముందు దిగదుడుపే

Dharma Mahesh: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. నా ముందే మరో వ్యక్తితో కార్లో.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్

Kantara Chapter1: బుధవారమే కాంతార చాప్టర్ 1 ప్రీమియర్.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవ్వదుగా!

RamCharan 18Yrs Legacy : రామ్ చరణ్ కామన్ డిపి లో అన్ని పాత్రల అరాచకాన్ని చూపించారు

Jr.Ntr: 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే ఇప్పటివరకు సాటిలైట్స్ రైట్స్ అమ్ముడు పోలేదు?

Suriya Jyothika : ఆస్కార్ బరిలో లీడింగ్ లైట్స్, దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య కూతురు

Kantara Chapter1 : కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్!

Big Stories

×