BigTV English

War 2 Film: వార్ 2 శుభం కాదు..ఆరంభం… సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్?

War 2 Film: వార్ 2 శుభం కాదు..ఆరంభం… సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్?

War 2 Film: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వార్ 2(War 2). యష్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ నుంచి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సినిమాలో టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్(NTR) కూడా నటించిన నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. అయాన్ ముఖర్జీ(Ayan Mukerji ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.


వార్ 2 నుంచి సర్ ప్రైజ్..

ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలను కలిగిస్తూ ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. వార్ 2 సినిమా అండ్ టైటిల్ కార్డు పడిన తర్వాత మరో సినిమా ఆరంభానికి నాంది పలకబోతోంది అని తెలుస్తుంది. ఆలియా భట్(Alia Bhatt), శార్వరి కలిసి నటిస్తున్న ‘ఆల్ఫా’ (Alpha)చిత్రానికి సంబంధించి ఒక సీక్వెన్స్ ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. కచ్చితంగా ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.


అలియా భట్ ఆల్ఫా…

ఈ విధంగా ఈ సినిమా క్లైమాక్స్ లో ఆల్ఫా సీక్వెన్స్ యాడ్ చేస్తున్న నేపథ్యంలో వార్ 2 తరువాత నెక్స్ట్ ఏంటి అనేదానికి ఈ సీక్వెన్స్ సమాధానమనే చెప్పాలి. ఇక ఆల్ఫా కూడా యష్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇలా ఈ ఏడాది చివరిన ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో వార్ 2 శుభం ఆల్ఫా ఆరంభానికి నాంది అయ్యేవిధంగా మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

రా ఏజెంట్ గా తారక్…

ఇక అలియా భట్ ఇటీవల కాలంలో ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆల్ఫా సినిమా కూడా ఇదే కోవకు చెందినదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు శివ్ రావైల్ దర్శకత్వం వహించక ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక వార్ 2 విషయానికి వస్తే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాల ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన అనంతరం ఈయనకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు రావడంతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావటంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ కు జోడిగా కియారా అద్వానీ నటించి సందడి చేశారు.

Also Read: Sambarala Yetigattu: మామకు పోటీగా అల్లుడు… సంబరాల ఏటిగట్టు విడుదల అప్పుడే?

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×