Raaka Movie:అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పక్కర్లేదు.నేషనల్ వైడ్ గా సత్తా చాటి వరల్డ్ వైడ్ గా 1800 కోట్లు కొల్లగొట్టిన ‘పుష్ప 2’ తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో రాకాపై విపరీతమైన బజ్ పెరిగిపోయింది.అయితే ఇప్పుడు బయటకు వస్తున్న షూటింగ్ అప్‌డేట్స్ చూస్తుంటే అభిమానుల్లో హైప్ కి మించిన డౌట్స్ రైజ్ అవుతున్నాయి.
అసలే భారీ బడ్జెట్,పైగా స్టార్ హీరోయిన్లు, అంతకు మించి ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు అంటూ మొదట్నుంచీ గట్టిగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేయడం కుదురుతుందా అన్న చర్చే ఇపుడు నెట్టింట్లో జోరుగా సాగుతుంది.
ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ‘రాకా’ కోసం మరో పెద్ద యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో దీనికోసం స్పెషల్ సెట్ వేస్తున్నారట కూడా.ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిందని సమాచారం. భారీ సెట్స్ వేయడం, వందల మంది సిబ్బందితో ఫైట్స్ తీయడం అంటే అంత ఈజీ కాదు కూడా.
మరోవైపు డిసెంబర్ రెండో వారంకి షూటింగ్ మొత్తం ఫినిష్ చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకపక్క ఫ్లాష్‌బ్యాక్ యాక్షన్ సీన్స్, ఇంకోవైపు క్రూషియల్ సీన్స్ .. ఇన్ని పెట్టుకుని అంత తక్కువ టైమ్‌లో షూటింగ్ ఎలా పూర్తి చేస్తారనే ప్రశ్నే అందరిలో రైజ్ అవుతుంది.ముఖ్యంగా బన్నీ లాంటి స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు ప్రతి సీన్ మీద స్పెషల్ గా కేర్ తీసుకోవాలి.
హడావిడిగా చుట్టేయడం కంటే క్వాలిటీగా తీయడమే ముఖ్యమని అట్లీకి తెలీంది కాదు.
ఇక కథ విషయానికి వస్తే ‘రాకా’ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఒక డాన్ చుట్టూ తిరిగే కథ అని వినిపిస్తుంది. కానీ ఈ స్టోరీలో అసలు కొత్తదనం ఎంటన్నది ఫ్యాన్స్ ని తొలుస్తున్న ప్రశ్న.ఎందుకంటే గ్యాంగ్‌స్టర్లు, డాన్లు, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఆల్రెడీ చాలా సినిమాలే వచ్చాయి.
అలాంటి కథను అట్లీ ఎలా కొత్తగా చూపిస్తారనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్.కేవలం భారీ యాక్షన్ సీన్లు, హీరో ఎలివేషన్లు, పెద్ద సెట్లతో ఆడియన్స్‌ను పూర్తిగా సాటిస్ఫై చేయడం కష్టమని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి కూడా. స్టోరీలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నాబాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం పక్కా.
ఇక అట్లీ విషయానికి వస్తే ఆయన కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ సినిమాలతో బాక్సాఫీస్ పై తనదైన స్టాంప్ వేసేశాడు.ఇక షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టింది కూడా.
కానీ ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన, ప్రతిసారీ అదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం. ఏది ఏమైనా బన్నీ ఇమేజ్‌కు తగ్గట్టు అట్లీ ఎలాంటి కథ రాసుకున్నాడనేదే అసలు మ్యాటర్.‘పుష్ప’, ‘పుష్ప 2’ తర్వాత బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవెల్‌లో పెరిగిందన్నది వాస్తవం.సో వచ్చే సినిమాపై అంచనలు ఒక రేంజ్ లో ఉంటాయి.మరి వాటిని అట్లీ అందుకుంటాడా లేదా తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే!
ALSO READ:ప్రీతి అందాల జాతర మామూలుగా లేదుగా.. చూపు తిప్పుకోవడం కష్టమే!