Stalin Delimitation: డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వైఖరిలో మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు ప్రయోజనాల కోసమే బిల్లుకు మద్దతు పలుకుతున్నానని అన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే, మమతా బెనర్జీ సహా ప్రతిపక్ష నేతలతో స్టాలిన్ భేటీ అనంతరం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష నేతలకు తమ వాదనలు స్టాలిన్ వివరిచారు. ప్రస్తుత బిల్లును ఓడిస్తే తమిళనాడుకు కనీస రక్షణ కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుతుందని అన్నారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్ల శాతం తగ్గే ప్రమాదం ఉందని దీంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం దెబ్బతింటుందని స్టాలిన్ అన్నారు.
వచ్చే 25 ఏళ్ల పాటు తమిళనాడు రాజకీయ బలాన్ని కాపాడుకోవడమే లక్ష్యం అని స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్ విషయంలో భావోద్వేగాలకు లోనై రిస్క్ తీసుకోలేమని స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు హక్కుల కోసం అన్నా, కరుణానిధి బాటలో పోరాడతామని, అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ మా వైఖరి ఒక్కటే.. అదే తమిళనాడు తీరు అని స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: పాతకాలం నాటి కమ్మని కొబ్బరి బూరెలు.. ఈ సీక్రెట్ టిప్ పాటిస్తే మొదటిసారే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి!