E-Paper
Advertisement

మెగా ఇంటికి ‘ఆకాశంలో ఒక తార’ టీం.. చిరు చరణ్ ప్రత్యేక అభినందనలు..

మెగా ఇంటికి ‘ఆకాశంలో ఒక తార’ టీం.. చిరు చరణ్ ప్రత్యేక అభినందనలు..
Advertisement

Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ , సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ఆకాశంలో ఒక తార. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సాదినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతో మంది సినీ ప్రముఖుల నుంచి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటుంది. ఇలా బ్లాక్ బస్టర్ సినిమాగా రన్ అవుతున్న ఈ సినిమా పట్ల మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మనసును కదిలించిన చిత్రం..

ఇలా ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చిరంజీవి ప్రశంసించారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదని, ఈ సినిమా తన మనసును కదిలించింది అంటూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.. అయితే తాజాగా చిరంజీవి ఆకాశంలో ఒక తార సినిమా బృందాన్ని ఏకంగా తన ఇంటికి ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇలా డైరెక్టర్ నుంచి మొదలుకొని నటీనటులు నిర్మాతలు కూడా చిరంజీవి ఇంటికి వెళ్లారు.. అక్కడ రామ్ చరణ్ చిరంజీవి నటీనటులకు పుష్పగుచ్చాలు ఇస్తూ అభినందనలు తెలిపారు.

చిత్ర బృందంపై మెగా ప్రశంసలు..

Advertisement

ఇలా చిరంజీవి ఏదైనా ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే కచ్చితంగా సినిమా బృందాన్ని ఇంటికి ఆహ్వానించి వారిని అభినందించడం ఆనవాయితీగా వస్తుంది. చిన్న హీరో పెద్ద హీరోనా అనే విషయాన్ని పక్కన పెట్టి మంచి సినిమాల పట్ల ప్రశంసలు కురిపిస్తూ నటీనటులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆకాశంలో ఒక తార టీంతో కలిసి రామ్ చరణ్, చిరంజీవి కొత్త సమయం పాటు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సాత్విక వీరవల్లి తదుపరి రాంచరణ్ సినిమాలో చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

చరణ్ జోడిగా సాత్విక..

రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న RC 17 పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే సాత్విక వీరవల్లి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం గురించి కూడా సాత్విక స్పందిస్తూ తాను ఈ సినిమా ఆడిషన్ కి వెళ్ళానని తెలిపారు. అయితే తనని డైరెక్టర్ కన్ఫర్మ్ చేశారా లేదా అనే విషయం మాత్రం తెలియదని సాత్విక వెల్లడించారు. సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ జోడిగా సాత్విక అయితే బాగుంటుందని మెగా ఫాన్స్ కూడా భావిస్తున్నారు. మరి చరణ్ జోడిగా సాత్విక సుక్కు సినిమాలో సందడి చేయబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. టెంపర్ వంశీకి చుక్కలు చూపించిన శివాజీ!

Related News

ప్రీతి అందాల జాతర మామూలుగా లేదుగా.. చూపు తిప్పుకోవడం కష్టమే!

హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?

అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!

టాలీవుడ్ హీరోలపై ‘అలియాస్ రుక్మిణి’ బ్యూటీ కామెంట్స్!

‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్

క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనేనా.. ఉపాసన పోస్టు వైరల్!

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

Big Stories

Advertisement
×