Allu Arjun New Movies : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. తన మొదటి సినిమాకి ఊహించిన స్థాయిలో పేరు రాలేదు. వెంటనే సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఆర్య సినిమా విపరీతమైన పేరును తీసుకొచ్చింది. గంగోత్రి సినిమా హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ రాఘవేందర్ రావు కి వెళ్ళిపోయింది.
ఆర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ తిరిగి వెనక్కి చూడకుండా కెరియర్ లో ముందుకు వెళ్లారు. అద్భుతమైన సినిమాలు ఎంచుకుంటూ తనను తాను కొత్తగా మలుచుకున్నాడు. అల్లు అర్జున్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆఫ్టేజ్ లో అల్లు అర్జున్ మాట్లాడే మాటలు కొన్నిసార్లు వైరల్ గా మారుతాయి గాని ఆన్ స్క్రీన్ పైన అల్లు అర్జున్ యాక్టింగ్ కి వంక పెట్టడానికి లేదు.
ముంబైలో అల్లు అర్జున్ ఆఫీస్
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ విపరీతంగా మారిపోయింది. ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే కేవలం తెలుగు సినిమాలకు, అలానే మలయాళం ప్రేక్షకులకు మాత్రమే బాగా సుపరిచితం. కానీ పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఇండియా వైడ్ అల్లు అర్జున్ ఫేమస్ అయిపోయారు. ఆ సినిమా లో పుష్పరాజ్ అనే క్యారెక్టర్ చాలామందిని విపరీతంగా ఇన్ఫ్లుయన్స్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఏకంగా ఐదు సినిమాలు తీసే ప్లాన్ లో ఉన్నాడు. దీనికి సంబంధించి ముంబైలో అల్లు అర్జున్ ఆఫీస్ తీసినట్లు సమాచారం వినిపిస్తుంది.
అన్ని తానే చూసుకుంటారు
కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అలానే ఊ అంటావా ఉ ఊ అంటావా పాట కూడా కొరియోగ్రఫీ చేసింది ఆయనే. గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన పాటలు పుష్పాలో బాగా వైరల్ గా మారాయి. అయితే ముంబైలో అల్లు అర్జున్ తీసిన ఆఫీసులో అన్ని వ్యవహారాలు గణేష్ ఆచార్య చూడనున్నారు. ఈ ఐదు సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ విషయంలో కూడా గణేష్ ఆచార్య ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. అల్లు అర్జున్ ప్లానింగ్ చేస్తుంటే మొత్తానికి తెలుగు సినిమాలకు దూరంగా ముంబైలో సెటిల్ అయిపోతారేమో అని డౌట్ కూడా వస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు.
Also Read: HHVM Pre Release Event : సినిమా ఈవెంట్ లో కాక రేపుతున్న రఘురామకృష్ణరాజు రాజకీయ వ్యాఖ్యలు