HHVM Pre Release Event : సినిమాలు రాజకీయాలకు మంచి అభినవభావ సంబంధం ఉంది. ఎందుకంటే చాలామంది సినిమా వాళ్లు రాజకీయాల్లో ఎప్పటినుంచో రాణిస్తూ వస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కూడా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ కు దూరం అయిపోయారు.
కేవలం సినిమాలు మాత్రమే ఇష్టపడే అభిమానులు కొందరు పవన్ కళ్యాణ్ ను రాజకీయపరంగా ఇష్టపడరు. దానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఎవరికి ఉండాల్సినవి వాళ్లకి ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం రాజకీయాలని సినిమా పరిశ్రమని వేరువేరుగా చూస్తారు. రాజకీయాల్లో నచ్చిన లీడర్ ని సపోర్ట్ చేస్తూ సినిమాలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పడతారు.
రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు
రఘురామ కృష్ణంరాజు నేడు జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఈయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఔరంగజేబుని ఓడించారు. కానీ ఈయన సినిమా రిలీజ్ కాకముందే ఆంధ్రప్రదేశ్లో ఔరంగజేబు లాంటి ఒక వ్యక్తిని ఓడించాడు అంటూ మాట్లాడారు. అయితే రఘురామకృష్ణం రాజు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపై ఇప్పటికే కొంతమంది వైసిపి శ్రేణులు సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఒకవైపు ఆ పార్టీని ఇష్టపడుతూ సినిమాలపరంగా పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే వాళ్లకు ఈ మాటలు కొద్దిపాటి బాధను కలిగిస్తాయి.
రఘురామ కృష్ణంరాజు ప్రస్థానం
రఘురామ కృష్ణంరాజు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు నిత్యం టీవీలో, సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళు. రఘురామ కృష్ణంరాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీ.వీ.ఎల్. నరసింహరాజుపై 56,421 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన నవంబర్ 14న ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
Also Read: Pawan Kalyan : మీరు నన్ను తిట్టుకుంటారు అని నాకు తెలుసు, ఆ ప్లాప్ సినిమా వల్లనే ఇలా అవుతుంది