Kiran Abbavaram: వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఊహించని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram). ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. తన అద్భుతమైన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పటికే రియాలిటీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడు రికార్డ్ అంటూ మరో కొత్త మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కిరణ్ అబ్బవరం సినీ కెరియర్ లో 14వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నేడు ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా ‘రికార్డ్’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ.. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేసింది.
కిరణ్ అబ్బవరం 14వ మూవీగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ కొత్త ప్రాజెక్టుకు రికార్డ్ అనే టైటిల్ తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్లో ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా కనిపిస్తున్న ఎర్రటి పౌర్ణమి ముందు ఒక గుర్రం కనిపిస్తోంది. ఇక అటు సైడ్ నుండి కిరణ్ అబ్బవరం ఆఫ్ సైడ్ ఫేస్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఎవరి ఊహకందని ఏదో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు అనిపిస్తోంది. అయితే కథ , పాత్రలు, జానర్ కు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది.
మరొకవైపు రియాలిటీ చిత్రంతో విడుదలకు సిద్ధమవుతున్న కిరణ్ అబ్బవరం.. అప్పుడే రికార్డ్ అనే కొత్త సినిమా ప్రకటనతో ఆయన అభిమానులలో ఉత్సాహం నెలకొంది. ఈ రికార్డు చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, థీ స్టోరీస్ బ్యానర్లపై వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వీర కోగటం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలను స్వీకరించగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి తాజాగా విడుదల చేసిన టైటిల్ వెనుక ఉన్న అర్థం, సినిమా కథ పై క్యూరియాసిటీ పెరగడంతో ఫస్ట్ లుక్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
కిరణ్ అబ్బవరం నటిస్తున్న రియాలిటీ సినిమా విషయానికి వస్తే.. తెలుగు ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి స్వయంగా కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రచయితగా కూడా పనిచేస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.