Yellowjackets Season 4 on OTT: సర్వైవల్ థ్రిల్లర్లను ఎప్పుడు చూసినా బోర్ కొట్టావు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో ఊపిరి కూడా తీసుకోనివ్వవు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సర్వైవల్ థ్రిల్లర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆకలి, చలి, ప్రాణభయం మనుషులను ఎంతటి క్రూరమైన మృగాలుగా మారుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, గత మూడు సీజన్లుగా గ్లోబల్ ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తోంది ఈ ఎమీ-నామినేటెడ్ సైకలాజికల్ సర్వైవల్ డ్రామా ‘యెల్లోజాకెట్స్’ (Yellowjackets). ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్ చివరి నాలుగో సీజన్‌తో (Season 4) డిజిటల్ తెరపైకి వచ్చేసింది. 25 ఏళ్ల క్రితం దట్టమైన అడవిలో జరిగిన ఆ రక్తచరిత్రకు ముగింపు పలుకుతూ వచ్చిన ఈ ఫైనల్ సీజన్, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సిరీస్ కథంతా రెండు వేర్వేరు కాలమానాలలో సాగుతుంది. 1996లో జరిగిన సంఘటనలను చూపిస్తూ, 25 ఏళ్ల తర్వాత ప్రజెంట్ లో జరిగే సంఘటనలతో ఉత్కంఠభరితంగా నడుస్తుంది. 1996లో నేషనల్ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు విమానంలో బయలుదేరిన ఒక హైస్కూల్ అమ్మాయిల ఫుట్‌బాల్ జట్టు, విమానం కూలిపోవడంతో దట్టమైన ఉత్తర అమెరికా అడవుల్లో చిక్కుకుపోతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, నెలల తరబడి ఆ అడవిలో బతకడానికి ఆ టీనేజ్ అమ్మాయిలు సాగించిన పోరాటం ఒక క్రూరమైన మృత్యు క్రీడగా మారుతుంది. ఆకలిని తట్టుకోలేక తోటి అమ్మాయిలనే వేటాడి నరమాంస భక్షణ వరకు వెళ్తుంది. ఆ భయానక గతాన్ని, నాలుగో సీజన్‌లో అడవి నుంచి రక్షించబడి తిరిగి వచ్చిన వాళ్ళు తర్వాత ఆ రహస్యాన్ని ఎలా దాచిపెట్టారు అనేది ఒళ్లు గగుర్పొడిచేలా చూపించారు.
మరోవైపు 25 ఏళ్ల తర్వాత ప్రస్తుతం పెద్దవారై, ఏమీ తెలీనట్టు గడుపుతున్న ఆ మిగిలిన బాధితుల జీవితాలు ఈ ఫైనల్ సీజన్‌లో పూర్తిగా తలకిందులవుతాయి. 19 నెలల పాటు ఆ అడవిలో తాము చేసిన పాపాలు, పాతిపెట్టిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలవుతాయి. ఇక గతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ మహిళలు ఏ స్థాయికి తెగించారు? అడవిలో మొదలైన ఆ వేట 25 ఏళ్ల తర్వాత నగరంలో వారిని ఎలా వెంటాడింది? చివరికి ఎవరు ప్రాణాలతో మిగిలారు? అనేది ప్రతి ఎపిసోడ్‌లోనూ సస్పెన్స్‌తో కట్టిపడేస్తుంది.
మెలానీ లిన్స్కీ (Melanie Lynskey), క్రిస్టినా రిక్కీ (Christina Ricci), టానీ సైప్రస్ (Tawny Cypress), సోఫీ నెలిస్సే (Sophie Nélisse), సోఫీ థాచర్ (Sophie Thatcher) ప్రధాన పాత్రల్లో నటించిన ‘యెల్లోజాకెట్స్’ (Yellowjackets) సిరీస్‌ను యాష్లే లైల్ (Ashley Lyle), బార్ట్ నికర్సన్ (Bart Nickerson) రూపొందించారు. ఈ మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 నవంబర్ 21 నుంచి భారత్‌లో ఈ నాలుగో సీజన్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్న ఈ ఫైనల్ సీజన్, ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ చొప్పున 2027 జనవరి వరకు స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ (English) ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, డార్క్ థ్రిల్లర్లు, మిస్టరీ డ్రామాలను ఇష్టపడే వారికి వీకెండ్‌లో ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
Read Also: ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్