E-Paper
Advertisement

శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు.. ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాద్ రావు ఫైర్

శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు.. ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాద్ రావు ఫైర్
Advertisement

Dharmana Prasada Rao: శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల వేడి ఆసక్తికరంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ తన దూకుడును పెంచింది. ఈ ప్రచారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రచారం సందర్భంగా ధర్మాన ప్రసాద్ రావు టీడీపీ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

హామీలు, అభివృద్ధిపై ప్రశ్నలు

Advertisement

ప్రభుత్వం ఇచ్చిన 160 హామీల్లో ఒక్కదానిని కూడా సరిగ్గా నెరవేర్చలేదని ధర్మాన ప్రసాద్ రావు విమర్శించారు. మూడు సంవత్సరాల పాలనలో అభివృద్ధి అనేదే లేకుండా పోయిందన్నారు. జిల్లాలో చెప్పుకోదగ్గ పనులు ఏమీ జరగలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమయ్యాయని, జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ఆయన నిలదీశారు.

నిధుల కేటాయింపు, ప్రజాధనం

Advertisement

శ్రీకాకుళం జిల్లాకు అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని ధర్మాన ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, మరోవైపు అమరావతి పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.

సంక్షేమం వర్సెస్ ధరల భారం

గతంలో జగన్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కానీ ప్రస్తుత పాలనలో సామాన్యులపై ధరల భారం పెరిగిందని ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. అలాగే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. ఇలాంటి ధోరణి సరైనది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి శ్రీకాకుళం ఎన్నికల ప్రచారంలో ధర్మాన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

Also Read: త్వరలో మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే..?

Tags

Related News

చీపురుపల్లి సభలో బొత్స సత్యనారాయణ ప్రసంగం.. మధ్యలోనే కరెంట్ నిలిపివేత!

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

యలహంక ప్యాలెస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

‘కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరిగి పడిపోతారట’.. కేతిరెడ్డిపై జేసీ వ్యంగ్యాస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయెుచ్చు: పవన్ కళ్యాణ్

‘నన్ను చంపాలని చూస్తున్నారు’.. జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు!

Big Stories

Advertisement
×