E-Paper
Advertisement

కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్.. ENE రిపీట్ తో భారీ క్రేజ్!

కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్.. ENE రిపీట్ తో భారీ క్రేజ్!
Advertisement

Srinath Maganti: ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది? రిపీట్’ చిత్రంతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ఈ నగరానికి ఏమైంది సినిమా విజయం తర్వాత సీక్వెల్ ప్రకటించినప్పుడు అందులో సుశాంత్ రెడ్డి స్థానంలో శ్రీనాథ్ మాగంటిని ప్రకటించారు? ఆ సమయంలో సుశాంత్ రెడ్డిని శ్రీనాథ్ మ్యాచ్ చేస్తాడా? లేదా? అని అందరిలో అనుమానాలు ఏర్పడ్డాయి .ఎందుకు తీసుకున్నారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది సినిమాలో కార్తీక్ పాత్రలో సుశాంత్ కి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అందర్నీ సంతృప్తి పరుస్తూ.. ఎక్కడా తేడా కొట్టకుండా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి.. సుశాంత్ క్యారెక్టర్ ను మరిపిస్తూ శ్రీనాథ్ కార్తీక్ పాత్రలో ఒదిగిపోయారు.

కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి..

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat)లో శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో అద్భుతంగా మెప్పించారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఈఎన్ఈ రిపీట్’లో గ్యాంగ్‌లో కొత్త కుర్రాడిగా శ్రీనాథ్ మాగంటి పేరును ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సుశాంత్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆయన స్థానంలో శ్రీనాథ్ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే విమర్శలను, ట్రోల్స్‌ను తన నటనతో ప్రశంసలుగా మార్చుకున్నాడు శ్రీనాథ్.

స్టార్ నటులతో సమానమైన క్రేజ్..

Advertisement

విశ్వక్ సేన్, అభినవ్ గోమఠంలతో కలిసి ప్రధాన పాత్రలో నటించిన ఆయన తన అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంటున్నారు. ఇతర నటులను అనుకరించడానికి ప్రయత్నించకుండా తరుణ్ భాస్కర్ ఊహించుకున్న పాత్రకు తగ్గట్టుగా, తన నిజాయితీతో ప్రాణం పోశాడు శ్రీనాథ్ మాగంటి.

ఇండస్ట్రీకి మరో క్రేజీ పెయిర్..

శివాత్మిక రాజశేఖర్‌‌తో శ్రీనాథ్ మాగంటి కెమిస్ట్రీ, ఇద్దరి జంట తెరపై అందరినీ ఆకట్టుకుంటోంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కోణాల్లో శ్రీనాథ్ ఆడియన్స్‌ని మెప్పించారు. మొత్తానికి తనకు లభించిన ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించి, ఒక నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

శ్రీనాథ్ బ్యాక్ గ్రౌండ్..

Advertisement

ఈ సినిమాతో అందరి అంచనాలను మించుతూ భారీ పాపులారిటీ అందుకున్న శ్రీనాథ్ గురించి ఆడియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన బ్యాక్ గ్రౌండ్, ఆయన నటించిన మునుపటి చిత్రాల గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. శ్రీనాథ్ చిత్ర పరిశ్రమతో సంబంధంలేని కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన వ్యాపార రంగంలో స్థిరపడి.. ఆ తర్వాత నటన రంగంలోకి అడుగుపెట్టారు.

ALSO READ: ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

వ్యాపార రంగం నుండి నటనా రంగంలోకి..

హైదరాబాదులో పుట్టి పెరిగిన శ్రీనాథ్.. ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే పూర్తి చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న పి ఎస్ జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు విశాఖపట్నంలోని సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో నటుడిగా శిక్షణ పొందిన శ్రీనాథ్.. హిట్ ఫ్రాంచైజీ లో అభిలాష్ గా నటించి మెప్పించారు.ఆ తర్వాత లక్కీ భాస్కర్ లో సూరజ్ గా, యానిమల్ చిత్రంలో కార్తీక్ గా నటించిన శ్రీనాథ్.. సింబ చిత్రంలో కూడా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది రిపీట్ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Related News

MS సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం మరో సాహసానికి సిద్ధమైన రష్మిక!

అనిరుద్ కావ్య వెడ్డింగ్ రిసెప్షన్.. ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!

వెంకీ మామ చైతూ పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. ఇద్దరిదీ ఒకటే క్యారెక్టర్ అంటూ!

నషాముక్త్ భారత్‌కు ప్రభాస్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం.. పోస్టర్ ఆవిష్కరణ

రష్మిక ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్… వాయిదా పడిన మైసా.. కారణం ఏంటంటే?

గార్జీయస్ లుక్ లో మలయాళ బ్యూటి.. చూపులతోనే పిచ్చెక్కిస్తుంది మావా..

జీవితాంతం ప్రేమ.. సంతోషాలు.. రామలక్ష్మికి చిట్టిబాబు కంగ్రాట్స్ !

Big Stories

Advertisement
×