Sobhita -Naga chaitanya: సినీ నటుడు అక్కినేని నాగచైతన్య నేడు తన 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇలా నాగచైతన్య తన పుట్టినరోజు కావడంతో ఈయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వెల్లడించారు. అదేవిధంగా ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్యకు ( Naga chaitanya) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య భార్య శోభిత(Sobhita) దూళిపాళ్ల సైతం సోషల్ మీడియా వేదికగా నాగచైతన్యకు స్పెషల్ విషయ తెలియజేస్తూ ఒక క్యూట్ ఫోటో షేర్ చేశారు
నాగచైతన్యతో కలిసి వెకేషన్ లో ఉన్న శోభిత చైతన్యకు ఘాటైన లిప్ లాక్ ఇచ్చిన ఫోటోని షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే లవర్”అంటూ ఈమె నాగచైతన్యకు పుట్టినరోజు(Birthday) శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య కాస్త రిజర్వ్డ్ అనే సంగతి అందరికీ తెలిసిందే అలాంటి చైతన్య శోభితకు ఇలా లిప్ లాక్ ఇచ్చినటువంటి ఫోటో బయటకు రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఫోటో చూసిన అభిమానులు రొమాంటిక్ కపుల్స్ అంటూ కామెంట్లు చేయడమే కాకుండా నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక నాగచైతన్య శోభిత గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన కెరియర్ లో 24వ సినిమాగా వృషకర్మ (VruShaKarma) అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో చైతన్య ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక చైతన్య సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తన తదుపరి సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈయన తన 25వ సినిమాని క్లాక్స్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రానుంది.
Also Read: కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే.. వామ్మో అనన్య లిస్ట్ చూశారా?