E-Paper
Advertisement

Allu Arjun Pushpa : మందు బాబులూ.. పెగ్ వేయాలని ఉందా… పుష్ప దగ్గరకు వచ్చేయండి

Allu Arjun Pushpa : మందు బాబులూ.. పెగ్ వేయాలని ఉందా… పుష్ప దగ్గరకు వచ్చేయండి
Advertisement

Allu Arjun Pushpa: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారసుడిగా కొనసాగుతున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా(Pushpa) ఆయన కెరియర్ ను పూర్తిగా కీలక మలుపు తిప్పిందని చెప్పాలి. పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

పుష్ప పేరుతో రెస్టారెంట్.. బార్..

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కు గ్లోబల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పాలి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కు నార్త్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పేరిట వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ అభిమాని ఏకంగా పుష్ప పేరుతో రెస్టారెంట్ అండ్ బార్ (restaurant and bar)నిర్వహించడం అందరిని ఆకట్టుకుంటుంది. కోల్ కత్తాలో(Kolkata) ఈ రెస్టారెంట్ అండ్ బార్ వెలుగులోకి రావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫోటోలు వీడియోలను మరింత వైరల్ చేస్తున్నారు.

ఇది సామీ మీ బ్రాండ్…

Advertisement

ఇక ఈ రెస్టారెంట్ లోపల కూడా పుష్ప సినిమాకు సంబంధించిన కొన్ని థీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ పట్ల ఏ స్థాయిలో అభిమానం ఉందో స్పష్టమవుతుంది. ఇక ఈ వీడియోలను అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తూ ఇది సామీ మీ బ్రాండ్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప రెస్టారెంట్ అండ్ బార్ పైలుక్ వేసేయండి. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రావడంతో మూడో భాగంపై కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి.

Advertisement

ఇక మూడవ భాగం షూటింగ్ పనులను జరుపుకోవడానికి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అలాగే సుకుమార్ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో పార్ట్ 3 రావడానికి ఆలస్యమవుతుందని చెప్పాలి. పుష్ప2 తరువాత అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సైలెంట్ గా, శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే 30% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ క్రిస్మస్ పండుగకు ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

Also Read: Aadhya Engagement: ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకున్న బుల్లితెర నటి ఆధ్య పరుచూరి.. ఫోటోలు వైరల్!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×