E-Paper
Advertisement

Ravi Shastri: అభిషేక్ శ‌ర్మ మెంట‌ల్ గా సెమీస్ కు సిద్ధంగా లేడు..వెంట‌నే మ‌రో ఓపెన‌ర్ ను తీసుకోండి

Ravi Shastri: అభిషేక్ శ‌ర్మ మెంట‌ల్ గా సెమీస్ కు సిద్ధంగా లేడు..వెంట‌నే మ‌రో ఓపెన‌ర్ ను తీసుకోండి
Advertisement

Ravi Shastri:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సెమీ ఫైనల్ పోరు రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఇక ఎల్లుండి మార్చి 5వ తేదీన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England) మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా నిర్వహిస్తారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియాకు కీలక సూచనలు చేశారు మాజీ క్రికెటర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్‌ రవి శాస్త్రి ( Ravi Shastri). అభిషేక్ శర్మ ( ABHISHEK SHARMA) మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని.. సెమీ ఫైనల్ మ్యాచ్ కు అతడు సిద్ధంగా లేడని బాంబు పేల్చారు రవి శాస్త్రి. ఛాన్స్ ఉంటే అభిషేక్ శ‌ర్మ‌ను తొలగించి సెమీ ఫైనల్ కోసం మరో ఓపెనర్ ను తీసుకోవాలని కీలక సూచనలు చేశారు రవి శాస్త్రి. లేక‌పోతే టీమిండియాకు పెను ప్ర‌మాదం ఉంటుందని హెచ్చ‌రించారు.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

అభిషేక్ శ‌ర్మ మెంట‌ల్ గా సెమీస్ కు సిద్ధంగా లేడు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament )  అభిషేక్ శర్మ ( ABHISHEK SHARMA) ప్రదర్శన అంత ఎఫెక్టివ్ గా లేదు. ఈ టోర్నమెంటులో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఒకే ఒక అర్థ సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్ పై కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అభిషేక్ శర్మ. సంజు గనక ఆడకపోతే టీం ఇండియా ఇంటిదారి పట్టేది. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ శర్మ పరిస్థితిపై రవి శాస్త్రి ( Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ మైండ్ సెట్ మొత్తం డిస్టబ్ అయిందని షాపింగ్ కామెంట్స్ చేశారు.

అతడు సెమీ ఫైనల్ కు సిద్ధంగా లేడనే తెలుస్తోందని వివరించారు. అతని స్థానంలో మరో ఓపెనర్ బరిలోకి దిగితే బెటర్ అని సూచనలు చేశారు. అతని మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని తెలిపారు. ప్రాక్టీస్ సమయంలో కూడా ఫోకస్ చేయలేక పోతున్నాడని విమర్శలు చేశారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సెమీ ఫైనల్ సందర్భంగా ప్లేయర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు రవి శాస్త్రి. అలాంటి సమయంలో అభిషేక్ శర్మ ఒత్తిడి ఎదుర్కొనే ఛాన్స్ లేదని వివరించారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ ను తీసుకుంటే బెటర్ అన్నారు రవి శాస్త్రి. దీంతో అభిషేక్ శ‌ర్మ‌పై ర‌విశాస్త్రి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×