Allu Sneha: అల్లు స్నేహారెడ్డి(Allu Sneha Reddy) పరిచయం అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న నటుడు అల్లు అర్జున్(Allu Arjun) సతీమణి అనే విషయం మనకు తెలిసిందే. స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాకపోయినప్పటికీ ఈమెకు మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని చెప్పాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. హీరోయిన్లకు పోటీగా పెద్ద ఎత్తున ఫోటోషూట్లను నిర్వహిస్తూ సోషల్ మీడియాలో హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఎంతో ఆదర్శంగా కూడా నిలిచారు. ఇక అల్లు అర్జున్ కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పలుచుకుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
స్టైలిష్ లుక్ లో అల్లు ఫ్యామిలీ…
ఈ క్రమంలోనే ఒక అభిమాని ఈమెతో చిట్ చాట్ చేస్తూ మీకు అత్యంత ఇష్టమైన ఫ్యామిలీ ఫోటో (Family Photo)ఏది అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు స్నేహ రెడ్డి స్పందిస్తూ తనకెంతో ఇష్టమైన ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తన భర్త పిల్లలతో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలో అల్లు అర్జున్, అర్హ ఒకే రంగు దుస్తులను ధరించగా స్నేహ రెడ్డి, అయాన్ బ్లాక్ అవుట్ ఫిట్ లో రాయల్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అట్లీ సినిమా పనులలో బన్నీ..
ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఈ ఫోటోలో అంత స్పెషల్ ఏముంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.. అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. చివరిగా పుష్ప 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ(Atlee) దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అవుతూ ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇక ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?