Pasivadi Pranam: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారందరూ పెరిగి పెద్దయిన తర్వాత హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన పసివాడి ప్రాణం(Pasivadu Pranam) సినిమాలో ఓ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు.ఈ సినిమాలో ఈ కుర్రాడి నటన అందరికీ బాగా గుర్తుండిపోతుందని చెప్పాలి అంత అద్భుతమైన నటనను కనపరిచారు
ఇకపోతే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ కుర్రాడు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అవునండి పసివాడి ప్రాణం సినిమాలో కుర్రాడి పాత్రలో నటించింది మరి ఎవరో కాదు నటి సుజిత(Sujitha). చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఈమె బుల్లితెర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. సుజిత తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. తెలుగులో ఈమెకు సుందరకాండ, వదినమ్మ వంటి సీరియల్స్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయి. ఈమె పేరుకే తమిళ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ.. ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు..
సుజిత కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించారు అయితే హీరోయిన్ గా సినిమాలలో సక్సెస్ అందుకోని నేపథ్యంలో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. అసలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పసివాడి ప్రాణం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే అమ్మాయిని కూడా అబ్బాయిగా చూపించేవారు. అందుకే ఆ సినిమాలో నన్ను చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నారని తెలిపారు.
చిరంజీవికి చెల్లెలుగా సుజిత…
పసివాడి ప్రాణం సినిమా తర్వాత తనకు మరో ఐదారు సినిమాలలో ఇలా అబ్బాయి పాత్రలలోనే నటించే అవకాశాలు వచ్చాయని ఆ సమయంలో తను పూర్తిగా బాయ్ కట్ తో తిరుగుతూ ఉండేదాన్ని అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే పసివాడి ప్రాణం సినిమాలో నటన తనకు పెద్దగా గుర్తు లేదని తెలియజేశారు. ఇలా పసివాడి ప్రాణం సినిమాలో పిల్లాడి పాత్రలో నటించినది సుజిత అనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. పసివాడి ప్రాణం సినిమా తర్వాత సుచిత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో ఆయనకు చెల్లెలి పాత్రలో కూడా నటించి సందడి చేశారు.
Also Read: Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!