BigTV English
Advertisement

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : సైకలాజికల్ హారర్ సినిమాలలో దిమ్మతిరిగే ట్విస్టులు ఉంటాయి. ఊహించని ట్విస్టులతో ఒక హాలీవుడ్థ్రిల్లర్ సినిమా, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇద్దరు టీనేజ్ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఒక సైకో ఎంట్రీ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇందులో ఆ సైకో ఎవరనేది ఒక షాకింగ్ ట్విస్ట్ తో రివీల్ అవుతుంది. ఈ ట్విస్ట్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘High Tension’ 2003లో విడుదలైన ఫ్రెంచ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. దీనిని అలెగ్జాండ్రే ఆజా డైరెక్ట్ చేశారు. ఇందులో సెసిల్ డి ఫ్రాన్స్ (మేరీ), మాయి ఫెరో (అలెక్స్), ఫిలిప్ నాహన్ (కిల్లర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 31 నిమిషాల నిడివి ఉన్న ఏ సినిమా IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2003 జూన్ 18న ఫ్రాన్స్‌లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం Amazon Prime Video, Shudderలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఈ కథ ఫ్రాన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ మేరీ, అలెక్స్ ఇద్దరు కాలేజీ స్నేహితులు. మేరీ ఒక ఇంట్రోవర్ట్, అలెక్స్‌పై క్రష్ ఉన్నట్లు కనిపిస్తుంది. అలెక్స్ ఫ్యామిలీకి చెందిన ఫామ్‌హౌస్‌లో వెకేషన్ కోసం వస్తారు. అయితే అలెక్స్ ఒక బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ, మేరీతో కొంచెం డిస్టెన్స్‌గా ఉంటుంది. రాత్రి వాళ్లు ఫామ్‌హౌస్‌లో సేద తీరుతున్నప్పుడు, గజిబిజి లుక్‌తో ఉన్న కిల్లర్ వస్తాడు. అతను ఒక సీరియల్ కిల్లర్‌లా కనిపిస్తాడు. అతను అలెక్స్ తల్లిదండ్రులను దారుణంగా చంపేస్తాడు. అలెక్స్‌ను కిడ్నాప్ చేసి, ఒక వ్యాన్‌లో తీసుకెళ్తాడు. మేరీ ఈ దాడి నుండి తప్పించుకుని, అలెక్స్‌ను కాపాడేందుకు కిల్లర్‌ను వెంబడిస్తుంది. ఈ సీన్స్ హై టెన్షన్‌తో ఉంటాయి.


మేరీ కిల్లర్ వెనక దాక్కుంటుంది. అతని వ్యాన్‌లో హైడ్ అవుతుంది. అలెక్స్‌ను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది.సెకండ్ హాఫ్‌లో, కథ మరింత ఇంటెన్స్ అవుతుంది. మేరీ ఒక గ్యాస్ స్టేషన్ వద్ద కిల్లర్‌తో ఫైట్ చేస్తుంది. అక్కడ ఒక స్టోర్ క్లర్క్‌ను కిల్లర్ గొడ్డలితో చంపేస్తాడు. అలెక్స్‌ను సేవ్ చేయడానికి మేరీ ఒక రోడ్‌సైడ్ చేజ్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఒక కార్‌ను హైజాక్ చేసి, కిల్లర్ వ్యాన్‌ను ఫాలో చేస్తుంది. కానీ ఇక్కడ కథలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. మేరీనే కిల్లర్ అని రివీల్ అవుతుంది. ఆమె మనసులో స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. అలెక్స్ పట్ల ఆమె అబ్సెషన్ వల్ల ఈ హత్యలన్నీ జరిగాయి. ఈ ట్విస్ట్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. క్లైమాక్స్‌లో అలెక్స్‌ను “సేవ్” చేయడానికి తన “కిల్లర్” పర్సనాలిటీతో మేరీ ఫైట్ చేస్తుంది. ఈ ఫైటింగ్ లో మేరీ స్ప్లిట్ పర్సనాలిటీ పోతుందా ? అలెక్స్‌ ఈ పరిస్థితి నుంచి బయట పడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : అప్పుల్లో కూరుకుపోయిన ఆటగాడు ఆంటీతో… ఈ సిరీస్ లో సింగిల్ గా చూడాల్సిన సీన్లు బోలెడు మావా

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×