BigTV English
Advertisement

Karimnagar Congress: కరీంనగర్ డీసీసీ రేసులో మేడిపల్లి సత్యం

Karimnagar Congress: కరీంనగర్ డీసీసీ రేసులో మేడిపల్లి సత్యం

Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్ అంటేనే గ్రూపు తగదాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పటికే నాలుగైదు గ్రూపులుగా విడిపోయినా కరీంనగర్ కాంగ్రెస్‌ని గాడిలో పెట్టాలంటే సమర్థుడైనా నాయకుడుకే డిసీసీ అధ్యక్షుడు పదవి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ లలో  కాంగ్రెస్ జెండా ఎగురవెయాలంటే.. జిల్లాలోని యువ ఎమ్మెల్యే వైపే ఇప్పుడు అందరి చూపు ఉంది. అతనికే జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తేనే అందరిని ఒకతాటిపైకి తీసుకువస్తాడని అధిష్టానం నమ్ముతుందటా.. ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు పదవికి ఎవరి పేరు ప్రధానంగా వినబడుతుంది.


కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు ‌పదవికి తీవ్రపోటి నెలకొంది. డిసీసీ అధ్యక్షుడు  ఎంపిక కోసం ఇప్పటికే  ఎఐసీసీ పరిశీలకులు ఆరు రోజులపాటు నియోజకవర్గాలలో పర్యటించి అభిప్రాయ సేకరణ చేసారు. రేసులో ఉన్న తుది జాబితాని కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానాని కి‌అందజేసారు. త్వరలోనే డిసీసీ అధ్యక్షుడు పదవికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ‌ఉండడంతో.. రేసులో దాదాపుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు ఖరారు అయ్యినట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి డీసీసీ అభ్యర్థులని ప్రకటించే విషయంలో అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం  ఇప్పటికీ జిల్లాలోని నియోజకవర్గాల లో ఎఐసిసి పరిశీలకులు పర్యటించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొసం చాలమంది దరాఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు తుది జాబితాలో చొప్పదండి ఎమ్మెల్యే పేరు డిసిసి రేసులో‌ ముందంజలో ఉంది.

మేడిపల్లి సత్యం ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా‌ ఉండడం, యువకుడు, ఉస్మానియా ఉద్యమ నాయకుడుగా గుర్తింపు ఉండడంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు కావడం.. సత్యంకి కలిసివచ్చే అంశాలుగా కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. అభిప్రాయ సేకరణ లో కూడ చాలమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరునే సూచించారు అని తెలుస్తుంది.


గ్రూపు తగాదాలకి చెక్ పెట్టి జిల్లా కాంగ్రెస్‌ని గాడిలో పెట్టే నాయకుడు.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమేనని కాంగ్రెస్ ‌అధిష్టానం  భావిస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు మేడిపల్లి సత్యం. ఉస్మానియా యూనివర్సిటీ లో పిహెచ్‌డి చేస్తున్న సమయంలో విద్యార్థి జేఏసికి నాయకత్వం వహించి రాష్ట్రం ‌అంతటా పాదయాత్ర చేసారు. రెండు సార్లు చొప్పదండి నియోజకవర్గం నుండి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజాక్షేత్రం ఉంటూ ప్రజాసమస్యలపై కొట్లాడారు.

Also Read: ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో పూల దండ లొల్లి..!! స్వర్ణ VS కొండా

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా నిత్యం ప్రజలతో మమేకమై.. అభివృద్ధి విషయంలో చొప్పదండి నియోజకవర్గంని ముందంజలో ఉంచుతున్నారు. ఇప్పుడు ఇవే సత్యం కి డీసీసీ అధ్యక్షుడు ‌పదవి చేబట్టడానికి సానుకూల, అనుకూల అంశాలుగా‌ మారాయి. కలహాలు, డిష్యూం..డిష్యూం ఫైట్లకి కేరాఫ్ గా ఉన్న కరీంనగర్ కాంగ్రెస్‌ని గాడిలో పెట్టాలంటే యువనాయకత్వం, నాయకత్వ పటిమ ఉన్న మేడిపల్లి సత్యం డీసీసీ ఇస్తే సరైనా అభ్యర్థి‌ అని అధిష్టానం భావిస్తుంది. చాలమంది పోటిదారులు ఉన్నగాని గ్రూప్ తగాదాలకి చెక్ పెట్టి రానున్న రోజుల్లో కరీంనగర్ కార్పోరేషన్, జిల్లాలోని‌ మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలలో‌ మెజారిటీ స్థానాలు గెలవడానికి కాంగ్రెస్ ‌నిత్యం ప్రజలు, కాంగ్రెస్ క్యాడర్‌‌తో మమేకం అయ్యి ముందుండి నడిపించే నాయకుడు.. మేడిపల్లి ‌సత్యం పేరునే ఫైనల్ చేసినట్లు గా కరీంనగర్ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతుంది.

Related News

Mukunda Jewellery: హైదరాబాద్‌లో ముకుందా జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్..

Jubilee Hills: అభివృద్ధికి, సెంటిమెంట్‌కు మధ్య పోటీ.. ‘సెంటిమెంట్’ అడిగే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్న సీఎం రేవంత్

Kcr Kavitha: కేసీఆర్ కాదు, ఇక జయశంకరే గాడ్ ఫాదర్

Jubilee Hills: జూబ్లీహిల్స్ గెలుపు వారిదే.. లోక్ పాల్ సంచలన సర్వే.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు.. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Jubilee Hills bypoll: ఇప్పుడు ఏడ చూసినా ఒక్కటే ముచ్చట.. జూబ్లీలో పాగా వేసేదెవరు..? నిజంగా జూబ్లీ కింగ్ ఎవరు?

Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Big Stories

×