BigTV English

Amitabh Bachchan: ఆ మూవీలో కాజోల్ కిల్లర్ అని తెలిసి అమితాబ్ షాక్.. డైరెక్టర్ కు చివాట్లు

Amitabh Bachchan: ఆ మూవీలో కాజోల్ కిల్లర్ అని తెలిసి అమితాబ్ షాక్.. డైరెక్టర్ కు చివాట్లు

Amitabh Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నటి కాజోల్(Kajol) విషయంలో ఎంతో ఆశ్చర్యానికి గురి అయ్యారని తెలుస్తుంది. కాజల్ ఓ సినిమాలో కిల్లర్ పాత్రలో (Killer Role)నటించారనే విషయం తెలుసుకున్న అమితాబ్ షాక్ అవ్వడమే కాకుండా సదరు డైరెక్టర్ కు చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మరి అమితాబ్ చేత తిట్లుతిన్న ఆ డైరెక్టర్ ఎవరు? కాజోల్ కిల్లర్ పాత్రలో నటించిన ఆ సినిమా ఏంటీ? అనేక విషయానికి వస్తే… బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కాజోల్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ఈమె గుప్త్ (Gupt)సినిమాలో కిల్లర్ పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.


కాజోల్ కిల్లర్ ఏంటీ?

ఈ సినిమా డైరెక్టర్ రాజీవ్ రాయ్(Rajiv Rai) దర్శకత్వంలో తెరకెక్కి 1997 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి బులేయ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవల జరిగిన చాట్‌లో, గుప్త్ సినిమాలో కాజోల్ ను ఒక కిల్లర్ పాత్రలో చూపించిన నేపథ్యంలో అమితాబచ్చన్ చివాట్లు పెట్టారనే విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం తెలిసిన అమితాబ్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కాజోల్ ను ఈ సినిమాలో ఒక హంతకురాలిగా చూపిస్తే అభిమానులు అంగీకరిస్తారా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేశారని తెలియజేశారు.


నా నమ్మకమే గెలిచింది…

ఇలా కాజోల్ పాత్ర విషయంలో అమితాబ్ ఎన్నో సందేహాలను కలిగి ఉన్నప్పటికీ తాను మాత్రం కచ్చితంగా కాజోల్ ఒక కిల్లర్ పాత్రలో కనిపించడాన్ని ప్రేక్షకులు కచ్చితంగా అంగీకరిస్తారనే నమ్మకంతో ఉన్నానని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తన నమ్మకమే నిజమైందని డైరెక్టర్ రాజీవ్ రాయ్ తెలియజేశారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అమితాబ్ కోసం తాను ఒక అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశానని రాజీవ్ గుర్తు చేసుకున్నారు.

సూపర్ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన అమితాబ్..

తాను దర్శకుడిగా మారిన కొద్ది రోజులకే అమితాబ్ గారి కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను ఖచ్చితంగా ఈ కథకు అమితాబ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావించాను కానీ ఆ కథను బిగ్ బీ పూర్తిగా తిరస్కరించారని రాజీవ్ గుర్తు చేసుకున్నారు. ఇలా అమితాబ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తాను అదే కథతో అక్షయ్ కుమార్ రవీనా టాండన్ సునీల్ శెట్టితో ఆ సినిమా చేశానని తెలిపారు. అయితే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుందని రాజీవ్ రాయ్ తెలియజేశారు. ఇలా అమితాబ్ రిజెక్ట్ చేసిన సినిమా మరి ఏదో కాదు మొహ్రా మూవీ అని తెలుస్తోంది. ఇక కాజోల్ విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇప్పటికీ కూడా ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Anirudh: కింగ్ డం ప్రీ రిలీజ్ .. లైవ్ పెర్ఫార్మెన్స్ కి సిద్ధమైన అనిరుద్… హోరెత్తిపోవాల్సిందే!

Related News

Bandla Ganesh: అవును… బండ్లన్న కామెంట్స్‌లో తప్పేముంది ?

Bandla Ganesh: బన్నీవాసు దెబ్బకు దిగొచ్చిన బండ్లన్న… ఆయన దేవుడు అంటూ ట్వీట్

Ameesha Patel: పెళ్లి తరువాత అది వద్దంటున్నారు.. అందుకే నేను చేసుకోవడం లేదు

Nazriya Nazim: ఫహాద్ తో విడాకుల రూమర్స్.. ఆ హీరోతో నజ్రియా రొమాన్స్

Nag Ashwin : కర్మను ఎవరు తప్పించుకోలేరు.. దీపికాకు డైరెక్టర్ కౌంటర్!

Manchu Manoj: మిరాయ్ ఎఫెక్ట్.. చిరుకు విలన్ గా మంచు మనోజ్ ..?

RK Roja: మరో అరుదైన అవార్డు అందుకున్న రోజా సెల్వమని కూతురు!

Sharwanand: షాకింగ్.. శర్వానంద్ విడాకులు.. ?

Big Stories

×