Ex Pak Player on India : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ ఆడుతోంంది. ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తరువాత వాస్తవానికి బంగ్లాదేశ్ తో సిరీస్ లోపాల్గొనాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్ లు రద్దు అయ్యాయి. ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీసీసీఐ హాజరు కాలేదు. కానీ వర్చువల్ గా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే బంగ్లా సిరీస్ రద్దు అయింది. మరోవైపు పహల్గామ్ దాడి కారణంగా సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు.. తదితర కారణాలతో టీమిండియా జట్టు WCL లో పాకిస్తాన్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. దీంతో సెమీస్ లోకి వెళ్లితే.. పరిస్థితి ఏంటి..? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ఆసియా కప్ కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read : Glen Maxwell : ఓపెనర్ గా మ్యాక్స్ వెల్.. ఇక సంచలనమే..!
బాయ్ కాట్ ఆసియా కప్..
“భారత ఆటగాళ్లు WCLని బహిష్కరించారు. దానిని జాతీయ డ్యూటీ అని పిలిచారు. కానీ ఇప్పుడు ఆసియా కప్ vs పాకిస్తాన్ బాగానే ఉంది? పాకిస్థాన్‌తో క్రికెట్ ఓకే అయితే, WCL కూడా ఉండాలి. మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి” అంటూ పేర్కొన్నారు డానిష్ కనేరియా.అయితే లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ రెండు సార్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 14, 21 తేదీల్లో.. ఈ రెండు మ్యాచ్ లు ఆదివారాల్లో జరగడం విశేషం. ఆ సియా కప్ హోస్ట్ హక్కులు టీమిండియావే అయినా.. యూఏఈ వేదికగానే మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇప్పుడిదే బీసీసీఐ పై అభిమానులు ఆగ్రహానికి కారణం అయింది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తో టీమిండియా క్రికెట్ ఆడకూడదని మాజీ క్రికెటర్లు, అభిమానులు కామెంట్లు చేశారు. తాజాగా వరల్డ్ ఛాంపియన్ షిప్ లెజెండ్స్ టోర్నీలో కూడా పాక్ ఛాంపియన్స్ తో భారత్ ఛాంపియన్స్ ఆడకపోవడంతో మ్యాచ్ రద్దు అయింది. ఇక ఇలాంటి సమయంలో ఆసియా కప్ లో భారత్-పాక్ మ్యాచ్ లు నిర్వహించాలనుకోవడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు టోర్నీనే బాయ్ కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.