E-Paper
Advertisement

అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?

అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?
Advertisement

Ananth Sriram: అనంత్ శ్రీరామ్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలకి తన కలం బలంతో సాహిత్యాన్ని అందించిన ఈ ప్రముఖ లిరిసిస్ట్  కుటుంబంలోని గొడవలు ఇపుడు రోడ్డు మీద పడ్డాయి. అవును.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నాడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనంత్ శ్రీరామ్ ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెలబ్రిటీ హోదాను పక్కనబెట్టి, ఒక సామాన్యుడిలా తన వృద్ధ తల్లిదండ్రుల ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను వేడుకోవడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

విషయంలోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఉన్నకేవలం ఐదు సెంట్ల ఉమ్మడి స్థలమేనని తెలుస్తోంది. ఈ ఐదు సెంట్ల భూమి చుట్టూ తిరిగిన కథ కాస్తా ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కలెక్టరేట్ మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. చట్టంపై గౌరవంతో తాను అధికారులను ఆశ్రయించానని చెబుతున్న అనంత్ శ్రీరామ్, ఈ వ్యవహారం వెనుక బలమైన రాజకీయ శక్తుల హస్తం ఉందని ఆరోపించడం గమనార్హం.

Advertisement

also read :ఆ సినిమాలో ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్.. అసలు రహస్యం బయటపెట్టి నెటిజన్ల నోళ్లు మూయించిన భాగ్యశ్రీ!

కబ్జా చేసిన చేగొండి సూర్యప్రకాష్

Advertisement

ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్. ఆ ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఈ వ్యవహారంలో సూర్యప్రకాష్ జోక్యం చేసుకుని తన తల్లిదండ్రులను తీవ్రంగా బెదిరిస్తున్నారని ఇచ్చిన కంపైంట్ లో చెప్పుకొచ్చాడు అనంత్ శ్రీరామ్.అయితే ప్రస్తుతం ఈ స్థల వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందని, కోర్టులో విచారణ జరుగుతుండగానే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని మనసులోని ఆవేదనని బయట పెట్టాడు.

కనీసం కోర్టు తీర్పు వచ్చే వరకైనా వేచి చూడకుండా, గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్న వృద్ధులైన తన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అనుచరుల నుంచి తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, వారికి తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులని కోరారు. ఈ కంపైంట్ పై స్పందించిన జిల్లా యంత్రాంగం, తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని యలమంచిలి తహసీల్దార్ మరియు స్థానిక పోలీసు అధికారులను ఆదేశించింది.

జోగయ్య సొంత సోదరి కుమారుడే అనంత్ శ్రీరామ్

అయితే ఈ వివాదంలో అత్యంత విచారకరమైన, ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అత్యంత సన్నిహిత రక్తసంబంధం. అనంత్ శ్రీరామ్ మరెవరో కాదు, చేగొండి హరిరామ జోగయ్యకు స్వయానా మేనల్లుడు. అంటే జోగయ్య సొంత సోదరి కుమారుడే అనంత్ శ్రీరామ్. ఇక హరిరామ జోగయ్య ప్రోద్బలం వల్లే కాదంటే ఔననిలే అనే సినిమాకి తొలిసారిగా పాటని రాసే అవకాశం దక్కించుకోవడం గమనార్హం.ఇక ఆ తర్వాత పచ్చ బొట్టేసినా, ఆరడుగులుంటాడా , రై రై రారా అంటూ ఎన్నో సూపర్ హిట్స్ ఆయన కలం లోంచి జాలు వారినవే.

also read :ఎగ్జిబిటర్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది.. టాలీవుడ్ సంక్షోభంపై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

ఏది ఏమైనా ఒకప్పుడు కలిసి కట్టుగా ఉన్న రెండు ఫ్యామిలీలు ఇపుడు కేవలం ఐదు సెంట్ల భూమి కోసం రోడ్డు కెక్కడం పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపొయింది.చూడాలి మరి సినీ రాజకీయ వర్గాల్లో అలజడి క్రియేట్ చేస్తున్న ఈ భూ కాంట్రవర్సీ ఎన్ని మలుపులు తిరుగుతుందో !

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×