Abaddameva Jayathe : విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రంలోని హృదయాలను హత్తుకునే ‘అమ్మ కోసం’ పాటను టాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎమోషనల్ టచ్ తో వస్తున్న ఆ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎమోషనల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. కన్నీళ్లు తెప్పించే లిరిక్స్ తో ప్రేక్షకులను మొదటి ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు ఇదే హైలెట్గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఈ పాట గురించి కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
పాటను రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ‘అమ్మ కోసం’ పాటలో మంచి భావోద్వేగం ఉంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ గీతం రూపొందింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వినోదాత్మక చిత్రానికి కార్తీక్ కొండ కథ, కథనం, దర్శకత్వం వహించారు. కొండ సందీప్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆడపిల్ల పుడితే అది అబద్ధాలు చెప్పిన వారికి శిక్ష అనే నమ్మకంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకుండా నిజాయితీగా జీవించాలని ప్రయత్నించే ఓ భర్త చుట్టూ సాగే వినోదభరితమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. నవ్వులతో పాటు ఆలోచింపజేసే సందేశాన్ని కూడా ఈ సినిమా ప్రేక్షకులకు అందించనుంది. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా స్టోరీ ఉండబోతుందని ఫిలింనగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు అయితే వచ్చిన అప్డేట్స్ జనాలని బాగానే ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా జనాల్లోకి ఎంతగా రీచ్ అవుతుందో చూడాలి.
సత్యమేవ జయతే అనే పదానికి ఇది కంప్లిట్ గా వ్యతిరేకంగా ఉంటుందని టైటిల్ ను చూస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ కథతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని అర్థమవుతుంది.. ఇకపోతే ఈ చిత్రంలో బాబు మోహన్, ప్రవణ్య రెడ్డి, సుశాంత్ యాష్కీ, భాను ప్రకాష్, వికాస్, విజయ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘అమ్మ కోసం’ పాటకు ఇప్పటికే చిత్రబృందం నుంచి విశేష స్పందన లభిస్తుండగా, విడుదలైన అనంతరం ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌తో పాటు మరిన్ని విశేషాలను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.. ప్రతి సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మరి మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ ను ఎందుకు ఉంటుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..